BJP : తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో తెలిసిపోయింది.. వరంగల్ పర్యటనలో మోదీ చెప్పేశారు.. ఈ వీడియో చూడండి
BJP : అసలు తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు.. చెప్పగలరా? కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే… ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్ లాగానే తయారైంది. బీజేపీలో అందరూ సీఎం క్యాండిడేట్సే. బండి సంజయ్ దగ్గర్నుండి నిన్న మొన్న పార్టీలో చేరిన ఈటల రాజేందర్, కోమటి రెడ్డి కూడా సీఎం అభ్యర్థులమే అని అనుకుంటారు. కానీ.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లు అనుకోవడం కాదు. బీజేపీ హైకమాండ్ ఎవరిని అనుకుంటే వాళ్లే అభ్యర్థి అవుతారు.
నిన్న మొన్నటి వరకు తెలంగాణలో చాలా యాక్టివ్ గా ఉండి.. బీజేపీకి చాలా క్రేజ్ తీసుకొచ్చిన నేత అంటే టక్కున బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు. కానీ.. బండి సంజయ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. చివరకు ఆయనకు ఇప్పుడు ఏ పదవి లేకుండా పోయింది. తెలంగాణ చీఫ్ పదవి కూడా పోవడంతో బండి సంజయ్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ కు మాత్రం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది హైకమాండ్. ఈటలకు పార్టీలో బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు.తాజాగా ప్రధాని మోదీ.. వరంగల్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వరంగల్ లో విజయ సంకల్ప సభలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ నేతలతో మాట్లాడారు. అందులో భాగంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ముగ్గురూ స్టేజీ మీద వరుసగా నిలబడ్డారు. స్టేజీ ఎక్కిన మోదీ నేరుగా ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈటల రాజేందర్ చేతులు పట్టుకున్నారు.
BJP : ఈటలనే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా?
ఆ తర్వాత నమస్కారం చెప్పారు. పక్కనే బండి సంజయ్ ఉన్న అస్సలు పట్టించుకోలేదు మోదీ. ఇదివరకు బండి సంజయ్ పై ఎంతో ప్రేమ చూపించిన మోదీ.. ఇప్పుడు ఎందుకు అలా మారిపోయారు. ఎందుకు బండిని పక్కన పెట్టి ఈటలతోనే మాట్లాడారు.. అంటే వచ్చే ఎన్నికల్లో ఈటలను ముందు ఉంచి తెలంగాణ ఎన్నికలను నిర్వహించాలనేది మోదీ ప్లాన్ అయి ఉంటుంది. ఒకవేళ ఈటలనే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
https://twitter.com/KP_Aashish/status/1677706188501442560