HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు – కేటీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు – కేటీఆర్

 Authored By ramu | The Telugu News | Updated on :3 April 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు - కేటీఆర్

HCA  : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కంచ గచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కూడా ఆ భూములను ఎవరు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. మూడేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఆ భూములను తిరిగి తీసుకుని, హైదరాబాద్ ప్రజలు, హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) విద్యార్థులకు అతిపెద్ద ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఈ భూములను విక్రయించాలని చూస్తోందని ఆరోపించారు.

HCA భూములు ఎవ్వరు కొనొద్దు నష్టపోవద్దు కేటీఆర్

HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు – కేటీఆర్

HCA  కంచ గచ్చిబౌలి భూములు ఎవ్వరు కొనుగోలు చేయొద్దని హెచ్చరించిన కేటీఆర్

కేటీఆర్ తెలిపిన ప్రకారం.. 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎకో పార్క్ హైదరాబాద్ ప్రజలకు మరియు యూనివర్సిటీ విద్యార్థులకు ఓ గొప్ప గిఫ్ట్ అవుతుందని ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మొగ్గు చూపుతుంటే, బీఆర్‌ఎస్ మాత్రం భవిష్యత్ తరాల భద్రత కోసం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ భూములను కొనుగోలు చేసే వారు తర్వాత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధితోనే కాదు, పర్యావరణ పరిరక్షణ కూ ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్య ప్రభావం ఎంతగా ఉందో, అదే పరిస్థితి హైదరాబాద్‌లో ఉండకూడదని ఆయన తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కాదని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ భూముల కోసం బీఆర్‌ఎస్ కోర్టులో పోరాడిందని, చివరకు ఈ భూములు ప్రజలకు తిరిగి వచ్చినట్లు తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది