
HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు - కేటీఆర్
HCA : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కంచ గచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కూడా ఆ భూములను ఎవరు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. మూడేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఆ భూములను తిరిగి తీసుకుని, హైదరాబాద్ ప్రజలు, హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) విద్యార్థులకు అతిపెద్ద ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఈ భూములను విక్రయించాలని చూస్తోందని ఆరోపించారు.
HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు – కేటీఆర్
కేటీఆర్ తెలిపిన ప్రకారం.. 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎకో పార్క్ హైదరాబాద్ ప్రజలకు మరియు యూనివర్సిటీ విద్యార్థులకు ఓ గొప్ప గిఫ్ట్ అవుతుందని ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మొగ్గు చూపుతుంటే, బీఆర్‌ఎస్ మాత్రం భవిష్యత్ తరాల భద్రత కోసం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ భూములను కొనుగోలు చేసే వారు తర్వాత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధితోనే కాదు, పర్యావరణ పరిరక్షణ కూ ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్య ప్రభావం ఎంతగా ఉందో, అదే పరిస్థితి హైదరాబాద్‌లో ఉండకూడదని ఆయన తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కాదని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ భూముల కోసం బీఆర్‌ఎస్ కోర్టులో పోరాడిందని, చివరకు ఈ భూములు ప్రజలకు తిరిగి వచ్చినట్లు తెలిపారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.