Padi Kaushik Reddy : నీకు నేను చాలు.. రేవంత్ కు పాడి కౌశిక్ సవాల్..!
ప్రధానాంశాలు:
Padi Kaushik Reddy : నీకు నేను చాలు.. రేవంత్ కు పాడి కౌశిక్ సవాల్..!
Padi Kaushik Reddy : తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన భాజపా, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు.

Padi Kaushik Reddy : నీకు నేను చాలు.. రేవంత్ కు పాడి కౌశిక్ సవాల్..!
Padi Kaushik Reddy నా స్థాయి ఎంతో .. నీ స్థాయి అంతే – రేవంత్ కు కౌశిక్ కౌంటర్
ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్‌కు వ్యంగ్యంగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించడానికి హరీష్ రావు, కేటీఆర్ కాకుండా.. కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. హరీష్ రావు తక్కువ స్థాయి నేతగా అభివర్ణిస్తూ, నేరుగా కేసీఆర్ సమాధానం చెప్పాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కఠినంగా స్పందించారు. రేవంత్ రెడ్డి సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు? నేనే ఉన్నాను కదా! అంటూ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి స్థాయి తనకంటే ఎక్కువ కాదని, అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.