Pandit krishnamacharya చివరి వరకు ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం .. గవ్వశాస్త్రం చెబుతున్న పండిట్ కృష్ణమాచార్య..
ప్రధానాంశాలు:
Pandit krishnamacharya చివరి వరకు ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం .. గవ్వశాస్త్రం చెబుతున్న పండిట్ కృష్ణమాచార్య..
Pandit krishnamacharya says win BRS or Congress
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే నవంబర్ 28న ప్రచారం ముగిసింది. 30వ తారీకు పోలింగ్ జరగనుంది
Pandit krishnamacharya ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే నవంబర్ 28న ప్రచారం ముగిసింది. 30వ తారీకు పోలింగ్ జరగనుంది ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా అని ప్రజల్లో ఉత్కంఠత పెరిగింది. అయితే తాజాగా పండిత్ కృష్ణమాచార్య ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అని గవ్వలు వేసి చెప్పారు. ఏ పార్టీ గెలుస్తుందో చివరి వరకు చెప్పలేమని, మీడియా వాళ్ళు, సామాజిక మాధ్యమాలు కొన్ని వేల మందిని మాత్రమే ఇంటర్వ్యూ చేసి ఆ పార్టీ గెలుస్తుందని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ తెలంగాణలో కోట్లాదిమంది ప్రజలు ఒకే నిర్ణయం మీద ఉన్నారని చెప్పలేం.
తెలంగాణలో చాలా సర్వేలు ఫలానా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని చెబుతారు. ఇలా ఎలా చెబుతున్నారు. ప్రజలను ఇంటర్వ్యూ చేసారా. వారు చెప్పినది స్వీకరిస్తున్నారా. గెలుస్తారా లేదా అనేది చిట్టచివరి వరకు కూడా టెన్షన్ గా ఉంటుంది. వీళ్ళందర్నీ కూడా మనం ఇంటర్వ్యూ తీసుకోలేదు కదా కొంతమందిని మాత్రమే ఇంటర్వ్యూ చేసి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ పార్టీ గెలుస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు, శాస్త్రం ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో చాలామంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.
ప్రజల వ్యతిరేకమైన ఓట్ల కారణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ కి మేలు జరగబోతుంది అంతే తప్ప ఒకేసారి బీఆర్ఎస్ ఓడిపోతుందని మనం అర్థం చేసుకోకూడదు. చిట్టచివరి నిమిషం వరకు కన్ఫ్యూజన్ నెలకొనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ సొంత బలంతో గెలిచే అవకాశం లేదంటే ప్రజలు కూడా ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా ప్రజా వ్యతిరేకత ఓట్ల వలన బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఓడిపోవచ్చు కానీ వెంటనే అధికారం కోల్పోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకో సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ కో ఉండదని కృష్ణమాచార్య తన అభిప్రాయాన్ని తెలియజేశారు.