Heavy Rains : తెలంగాణ లో స్కూళ్లకు సెలవు ఇవ్వండి మహాప్రభో..!
ప్రధానాంశాలు:
తెలంగాణ ప్రభుత్వానికి స్కూల్స్ కు సెలవు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
తెలంగాణలో భారీ వర్షాలు: విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీవర్షాలు ప్రజల జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఏర్పడగా, రహదారులు కూడా చాలావరకు నష్టపోయాయి. ప్రయాణాలు కష్టతరంగా మారాయి.

Heavy Rains : తెలంగాణ లో స్కూళ్లకు సెలవు ఇవ్వండి మహాప్రభో..!
Heavy Rains భారీ వర్షాల ప్రభావం తో స్కూళ్లకు సెలవు కోరుతున్న తల్లిదండ్రులు
మరోపక్క నేడు మరియు రేపు నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే మార్గాలు సురక్షితంగా లేకపోవడమే కాకుండా, వర్షం కారణంగా అనారోగ్యం వచ్చే ప్రమాదం కూడా ఉంది.
దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్ తరగతులపై దృష్టి పెట్టాలని సూచనలు వెలువడుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం, రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని తల్లిదండ్రులు గళమెత్తుతున్నారు. మరి ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ఇస్తుందో లేదో చూడాలి.