Peacock Curry : కఠకఠాల పాలు చేసిన నెమలి కూర.. సిరిసిల్ల యూట్యూబర్ పై అటవి పోలీసుల యాక్షన్ షురూ..!
ప్రధానాంశాలు:
Peacock Curry : కఠకఠాల పాలు చేసిన నెమలి కూర.. సిరిసిల్ల యూట్యూబర్ పై అటవి పోలీసుల యాక్షన్ షురూ..!
Peacock Curry : మనం చేసే కొన్ని పనుల వల్ల అనవసరమైన తలనొప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కరోజులోనే ఫేమస్ అవ్వాలని అనుకుంటే మాత్రం లేనిపోని కష్టాలు తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు అవుతుంది. లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ ఇలానే ఓవర్ నైట్ తన గురించి అందరు మాట్లాడుకోవాలని అనుకుని కఠకఠాల పాలయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది అంటే.. సిరిసిల్లలో వంట వీడియోలు చేస్తూ యూట్యూబర్ గా ఉన్న ఒక వ్యక్తి తన వీడియోలు పాపులర్ అవ్వాలి. తన గురించి అందరు మాట్లాడుకోవాలనే ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఎలా వ్యూస్ రాబట్టుకోవాలని ఆలోచించి. నెమలి కూర వండి దాన్ని యూట్యూబ్ లో పెట్టాడు.
నెమలి మన జాతీయ పక్షి. దాన్ని పట్టుకోవడమే నేర. వన్య ప్రాణి సమ్రక్షణ చట్టం కింద వారికి జైలు శిక్ష విధిస్తారు. అలాంటిది నెమలి కూర వండి దాన్ని వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టడం అనేది క్షమించరాని నేరం. సంప్రదాయ జాతీయ పక్షి కూరా అని నెమలి కూరని వండి వీడియో చేసిన ఆ యూట్యూబర్ అనుకున్నట్టుగానే వీడియో వైరల్ కాగా అది చివరకి అటవీ శాఖ పోలీసుల దాకా వెళ్లింది.
Peacock Curry నెమలి కాదు కోడి కూర అన్న యూట్యూబర్..
వన్య ప్రాణి సమ్రక్షణ చట్టం కింద ఆ యూట్యూబ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అటవీశాఖ పోలీసులు. ఐతే విచారణలో అతను అడవి పంది కూర కూడా వండినట్టు వీడియోస్ లో ఉంది. ఐతే అతను మాత్రం తాను కోడి కూర వండి వ్యూస్ కోసం నెమలి కూర అని పెట్టానని అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను అటవీ శాఖ అధికారుల విచారణలోనే ఉన్నాడు.
వన్య ప్రాణుల సమ్రక్షణ చట్టం కింద జాతీయ పక్షులు, అడవి జంతువులను వేటాడి వాటిని కూర వండుకోవడం అనేది క్షమించరాని నేరం. ఈ విషయంపై అటవీ శాఖ చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. మరి ఆ యూట్యూబ్ నిజంగానే నెమలి కూర వండాడా.. లేదా కోడి కూర వండి నెమలి అని కేవలం వ్యూస్ కోసమే అలా చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి నెమలి కూర అని వ్యూస్ కోసం ఆ యూట్యూబర్ చేసిన పని వల్ల ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వచ్చింది.