Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు…

 Authored By ramu | The Telugu News | Updated on :29 December 2024,12:37 pm

ప్రధానాంశాలు:

  •  Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు...

Peerzadiguda : మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గణనీయమైన అభివృద్ధి పథంలో నడిపించిన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని స్మరించుకుంటూ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Peerzadiguda పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు

Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు…

ఈ సందర్భంగా రవి గారు మాట్లాడుతూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ నూతన దశకు చేరుకున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి అభివృద్ధి, స్థిరత్వాన్ని తీసుకువచ్చాయని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకాలు అని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నారోజు జంగాచారీ, పాలడుగు సురేందర్ రెడ్డి,జోగు సోమయ్య, కంది రంజిత్ రెడ్డి,విజయందర్ రెడ్డి,రంగన్న గౌడ్,బర్రె నాగరాజు, ఉప్పరి ఉదయ్, గొంగిడి కృష్ణ, అదాల అమర్నాథ్ తదితర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది