Ponguleti : కేసీఆర్ సర్కార్‌కి ఇదే నా సవాల్.. పొంగులేటి సంచలన కామెంట్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ponguleti : కేసీఆర్ సర్కార్‌కి ఇదే నా సవాల్.. పొంగులేటి సంచలన కామెంట్స్ వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :9 October 2023,1:00 pm

Ponguleti : కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన చేయలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. కానీ.. కాంగ్రెస్ మాత్రం ఇంకా ప్రకటించకపోవడంపై చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. పార్టీలో ఏం జరుగుతోంది. కొందరు నాయకులు కొందరు అభ్యర్థుల ఎంపికను వ్యతిరేకిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పొంగులేటి తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉన్న పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటిది. ఒక వ్యక్తి, ఒక శక్తి నిర్ణయించే కార్యక్రమం కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచనలు చేసి అడుగు వేస్తుంది. అభ్యర్థుల ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది అని పొంగులేటి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే.. తమ ఖాతాలో వేసుకున్న కల్వకుంట్ల కుటుంబానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. కాంగ్రెస్ లో ప్రతి నియోజకవర్గంలో కేపబుల్ ఉన్న లీడర్లు చాలామంది ఉన్నారు. అందుకే అందరితో సంప్రదించి సరైన నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టే అభ్యర్థుల ప్రకటన లేట్ అవుతోంది. కాంగ్రెస్ ఏ వాగ్దానం ఇచ్చినా అది ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ఏ మాట చెప్పినా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ప్రజల్లో విశ్వాసం ఇప్పటికీ ఉంది. ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. అద్భుతమైన ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రకటించారో.. సాధ్యమైనవే ప్రకటించారు. వాటితో పాటు ప్రజలకు మంచి జరిగే ఏ కార్యక్రమానికి అయినా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదు.. అని పొంగులేటి చెప్పుకొచ్చారు.

ponguleti srinivas reddy comments on cm kcr

#image_title

Ponguleti : 15 రోజుల నుంచి ముఖ్యమంత్రి కనిపించడం లేదు.. ఎక్కడికి వెళ్లారు?

తెలంగాణ యాసతో, తెలంగాణ గోసను పట్టించుకోకుండా తొమ్మిదిన్నరేళ్లలో అహంకారంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు. గత 15 రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారు. కనిపించడం లేదు ఏంటి. ముఖ్యమంత్రిగా మీకే ఆరోగ్యం బాగోలేకపోతే.. తెలంగాణ ప్రజలను ఎవరు పట్టించుకుంటారు. హామీలు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కింది కేసీఆర్. దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి, రైతులకు ఉచిత ఎరువులు, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు.. ఇలాంటి అనేక వాగ్దానాలు చేశారు. దళిత సోదరులకు దళిత బంధు ఇస్తా అని చెప్పి హుజురాబాద్ లో ప్రకటించి.. అక్కడ ఉపఎన్నికల్లో అక్కడ ఒక నియోజకవర్గంలో అమలు చేసి ఇప్పటి వరకు ఒక్కో నియోజకవర్గానికి వందో రెండొందలో ఇచ్చి మేడి పండు చూపించి కాలయాపన చేస్తున్నారు.. అని పొంగులేటి మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది