YS Sharmila : జ‌గ‌న్ ఓట‌మి చెందిన వ‌ద‌ల‌నంటున్న ష‌ర్మిళ‌.. అస‌లు ఆమె వ్యూహం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : జ‌గ‌న్ ఓట‌మి చెందిన వ‌ద‌ల‌నంటున్న ష‌ర్మిళ‌.. అస‌లు ఆమె వ్యూహం ఏంటి?

YS Sharmila : ఏపీ రాజ‌కీయాలు గ‌త కొద్ది రోజులుగా ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. కూట‌మి విజ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర పోషించ‌గా, జ‌గ‌న్‌ని ఓడించాల‌ని ష‌ర్మిళ కంక‌ణం క‌ట్టుకుంది. స‌రే ఇప్పుడు జ‌గ‌న్ ఓడిపోయాడు. క‌నీసం ఇప్పుడు అయిన ఆమె శాంతిస్తుందా అంటే అది లేదు. ఓట‌మి చెందిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌ని టార్గెట్ చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది ష‌ర్మిళ‌. తండ్రి వారసత్వంతో ఇద్దరూ రాజకీయాల్లో అడుగుపెట్టినా… చెరోదారి ఎంచుకోవడమే పాలిటిక్స్‌ను హాట్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2024,5:00 pm

YS Sharmila : ఏపీ రాజ‌కీయాలు గ‌త కొద్ది రోజులుగా ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. కూట‌మి విజ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర పోషించ‌గా, జ‌గ‌న్‌ని ఓడించాల‌ని ష‌ర్మిళ కంక‌ణం క‌ట్టుకుంది. స‌రే ఇప్పుడు జ‌గ‌న్ ఓడిపోయాడు. క‌నీసం ఇప్పుడు అయిన ఆమె శాంతిస్తుందా అంటే అది లేదు. ఓట‌మి చెందిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌ని టార్గెట్ చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది ష‌ర్మిళ‌. తండ్రి వారసత్వంతో ఇద్దరూ రాజకీయాల్లో అడుగుపెట్టినా… చెరోదారి ఎంచుకోవడమే పాలిటిక్స్‌ను హాట్‌ హాట్‌గా మార్చేసింది. జగనన్నపై గురి పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు షర్మిల.

YS Sharmila : వైఎస్ షర్మిల టార్గెట్ ఏంటి?

పీసీసీ చీఫ్‌గా నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల…. ముఖ్యంగా తన సోదరుడు, మాజీ సీఎం జగన్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. జగన్‌ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్‌లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్‌ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత సీఎం పదవిని కోరుకున్న జగన్‌రెడ్డికి షర్మిల మద్దతు తెలిపారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఆయన తరఫునే ప్రచారం చేశారు. కానీ, గత ఎన్నికల ముందు ఆయనతో విభేదించి ప్రతిపక్ష పాత్రను ఎంచుకున్నారు షర్మిల. తన తండ్రి అనుచరులు, అభిమానులే ఎక్కువగా వైసీపీలో ఉండటంతో…. వారిని ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేసి… తను కూడా సీఎం కావాలనే కలలు కంటున్నారు షర్మిల.

ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తోన్న షర్మిల… ఇటు అధికార కూటమితో యుద్ధం చేస్తూనే… వైసీపీని ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటనపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా… ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి వెళ్లనని ఆయన చేసిన ప్రకటనతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆమె విమర్శలకు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో షర్మిల సీఎం చంద్రబాబు డైరెక్షన్‌ లో పని చేస్తున్నారని వైసీపీ చేసిన విమర్శలపైనా ఘాటుగానే సమాధానమిచ్చారు. అన్నపై పోరాటంలో మాటలు, ట్వీట్‌లే కాకుండా… ప్రజా సమస్యలకు కూడా కారణం జగన్‌ పాలనే అన్న విషయాన్ని లేవనెత్తుతూ… జగన్‌ కన్నా, అన్ని రకాలుగా తానే ఎక్కువ అనే కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతుండ‌గా, జ‌గ‌న్‌పై పైచేయి సాధించేందుకు ష‌ర్మిళ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది