Rahul Gandhi : హైడ్రా కూల్చివేతల వెనక రాహుల్ హస్తం ఉందా..ఆయన అండతోనే రేవంత్ అలా..!
Rahul Gandhi : హైదరాబాద్ లేక్ సిటీలో చెరువులు, ఎఫ్‌టీఎల్‌లను కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తుండడం మనం చూస్తున్నాం. దీంతో రేవంత్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ రంగంలోకి దిగేసింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం తండాలో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. ఇటీవల ఏపీ, తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ, ఖమ్మం పట్టణాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. అక్రమ కట్టడాలవల్లే డ్యామేజ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. […]
ప్రధానాంశాలు:
Rahul Gandhi : హైడ్రా కూల్చివేతల వెనక రాహుల్ హస్తం ఉందా..ఆయన అండతోనే రేవంత్ అలా..!
Rahul Gandhi : హైదరాబాద్ లేక్ సిటీలో చెరువులు, ఎఫ్‌టీఎల్‌లను కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తుండడం మనం చూస్తున్నాం. దీంతో రేవంత్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ రంగంలోకి దిగేసింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం తండాలో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. ఇటీవల ఏపీ, తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ, ఖమ్మం పట్టణాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. అక్రమ కట్టడాలవల్లే డ్యామేజ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులను కబ్జా చేసినవారిపై చర్యలు చేపట్టింది హైడ్రా.. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది.
Rahul Gandhi : రాహుల్ అండతోనే..
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి తెల్సిందే.. మరోవైపు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తుతూ ట్విట్టర్ లో మద్ధతుగా నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ సైతం ముఖ్యమంత్రికి అండగా నిలిచినట్లు తెలుస్తుంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు సోదరుడికి చెందిన ఓఆర్వో స్పోర్ట్స్ కాంప్లెక్స్ హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్‌లో ఉందని హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ విషయంపై మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు నేరుగా రాహుల్‌కు ఫిర్యాదు చేయడమే కాకుండా తన అసంతృప్తిని సైతం వెల్లగక్కినట్లు తెలిసింది.
అయితే, రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్టుగా నిలిచారని, అక్రమ కట్టడాలు ఎవరివి అయినా ముందుకు వెళ్లాలని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. అతనికి మద్ధతుగా నిలవాలని సూచినట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీ సపోర్ట్‌తో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. ఇక ఇటీవల వచ్చిన వరదలతో జనజీవనం అస్తవ్యస్తం కాగా, రేవంత్ రెడ్డి అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ వారికి సాయం అందిస్తున్నారు. మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.