Raja Singh : రాజాసింగ్ ఆ పార్టీలో చేరనున్నాడా..?
ప్రధానాంశాలు:
రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం పట్టించుకోవడం లేదా..?
Raja Singh : గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా బీజేపీ కి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ లో నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియలో తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ, తన మద్దతుదారులను బెదిరించారని తీవ్రంగా విమర్శించిన రాజాసింగ్, అదే పార్టీ కార్యాలయం నుంచి రాజీనామా ప్రకటన చేశారు. గత కొంతకాలంగా పార్టీ నేతల తీరు పట్ల అసంతృప్తితో ఉన్న రాజాసింగ్, పలు సందర్భాల్లో బీజేపీ పైనే బహిరంగ విమర్శలు చేశారు.

Raja Singh : రాజాసింగ్ ఆ పార్టీలో చేరనున్నాడా..?
Raja Singh : రాజాసింగ్ రాజీనామా చేసాడు.. మరి నెక్స్ట్ ఏంటి..?
రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ హైకమాండ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఆ పార్టీ అంతర్గతంగా ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పార్టీకి రాజీనామా చేయడం సరైందా అనే చర్చ బీజేపీ నేతల మధ్య సాగుతోంది. దీనికితోడు కేంద్ర నాయకత్వం ఆయన పట్ల ఇప్పటికే అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో రాజాసింగ్ తనకు నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ, పార్టీ తన రాజీనామాపై ఎలా స్పందిస్తుందో తెలుసుకున్న తర్వాతే తన భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
ఇదిలా ఉండగా రాజకీయ వర్గాల్లో రాజాసింగ్ త్వరలో శివసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. హిందూత్వ రాజకీయాలను కొనసాగించేందుకు ఆయన మరో వేదిక కోసం చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే శివసేన నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. బీజేపీ నుంచి ఆయన పూర్తిగా వైదొలిగితే, శివసేనలో కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దిల్లీ నేతల స్పందనను బట్టి రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తు దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.