Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్
ప్రధానాంశాలు:
Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? - రాజగోపాల్
Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తనకు మంత్రి పదవి దక్కకపోవడం తో ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇవ్వడం కుదరడం లేదని కాంగ్రెస్ అగ్ర నేతలు చేస్తున్న కామెంట్స్ పై రాజగోపాల్ రియాక్ట్ అయ్యారు. “నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడే, మేమిద్దరం అన్నదమ్ములమని తెలియదా?” అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను ఆయన “ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న” చందంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను, నల్గొండ జిల్లాను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన పరోక్షంగా సూచించారు.

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్
Rajagopal Reddy : మరోసారి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా అని సూటిగా ప్రశ్నించారు. తాను తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరం సమర్థులమే, గట్టివాళ్లమే అని స్పష్టం చేశారు. అయితే పార్టీలో తమను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రి పదవి కోసమే తాను పార్టీలో చేరలేదని, మునుగోడు ప్రజలకు న్యాయం జరగాలనేదే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే, తన నియోజకవర్గమైన మునుగోడు ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. “నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయవద్దు” అని గత ప్రభుత్వానికి చెప్పానని, ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి. మంత్రి పదవుల విషయంలో ఉన్న అసంతృప్తిని రాజగోపాల్ రెడ్డి బయటపెట్టడంతో, ఇది భవిష్యత్తులో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.