Khammam congress MP : ఖమ్మం జిల్లాలో హస్తం హవా.. తెరపైకి ఊహించని అభ్యర్థి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khammam congress MP : ఖమ్మం జిల్లాలో హస్తం హవా.. తెరపైకి ఊహించని అభ్యర్థి…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Khammam congress MP : ఖమ్మం జిల్లాలో హస్తం హవా.. తెరపైకి ఊహించని అభ్యర్థి...!

Khammam congress MP : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు జాబితా దేశమంతటా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ప్రకటనకు ఎన్ని జాబితాలు విడుదల అవుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇంకా తెరపైకి రావడం లేదు. ఇక ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉండడంతో ఖమ్మం ఎంపీ అభ్యర్థి వ్యవహారం ఢిల్లీలో సెగ రేపుతుంది. అయితే ఖమ్మం జిల్లాలో ఈ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతుండగా రాష్ట్రస్థాయి నేతలు కూడా ఈ స్థానంపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత వి హనుమంతరావు ను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి బుజ్జగించడంతో ప్రస్తుతం ఆయన ఈ రేసు నుండి తప్పుకున్నారని తెలుస్తోంది.

Khammam congress MP ఆ ముగ్గురికి చెక్‌..

ఇదిలా ఉండగా ఇప్పటికే మంత్రి పదవులను అనుభవిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వడంపై జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలని విషయంలో తల పట్టుకుంది. అయితే ఇప్పుడు పోటీపడుతున్న ముగ్గురిలో ఒకరికి టికెట్ కేటాయించిన మరో ఇద్దరు అసహనం వ్యక్తం చేసే అవకాశాలు ఉండడంతో అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్స్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు తెరవడంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుండి నాయకులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అయితే గత ప్రభుత్వ హాయంలో కీలకమైన పదవులను ఆశించిన నేతలు సైతం కాంగ్రెస్ లోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లుు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు నడుమ నెలకొన్న పోటీని తగ్గించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎంపీ నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి చేరతారని వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయంలో ఖమ్మం ఎంపీ స్థానం నుండి ఆయన పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో వెనుకడుగు వేశారు.కాగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పోటీ వాతావరణాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావును ఆహ్వానించి ఆయనకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఖమ్మం రాజకీయాలలో నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎంట్రీ ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది