Revanth Rddy : ఇంకోసారి గుంపు మేస్త్రి అంటే గుణపం దింపుతా… సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

Authored By aruna | The Telugu News | Updated on : 27 January 2024, 10:00 am
  •  Revanth Rddy : ఇంకోసారి గుంపు మేస్త్రి అంటే గుణపం దింపుతా...సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...!

Revanth Rddy : తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీను ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే,చేస్తానని హామీ ఇచ్చిన పథకాలను నెరవేర్చాలంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. అయితే బిఆర్ఎస్ నేతలు చేసే విమర్శలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ నేపథ్యంలోనే ఓ సభలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. అయితే ఇవాల్టికి అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కావడం లేదు. అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతున్నారు. అయితే ఇంతకుముందే నా మిత్రుడు కొండ ప్రభాకర్ రావు గారు నాకు చెప్పారు మనం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆడబిడ్డల కోసం మొదలుపెట్టినమో ఇప్పటివరకు పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అని చెప్పిండు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణించే విధంగా సౌకర్యం కల్పించినందుకు ప్రతి ఒక్కరూ కూడా సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాము. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరిి అభిమానంతో మరో రెండు పథకాలను అమలులోకి తీసుకురావడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సన్నాసులారా మీరా మమ్మల్ని అడిగేది…3650 ,రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మీరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు.. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు. గిరిజనులకు కూడా 12 శాతం రిజర్వేషన్ కల్పించలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి ఏమీ చేయని సన్నాసులు ఈరోజు మేము ఏమి చేయట్లేదు అంటున్నారా…మీకేం అర్హత ఉంది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు.ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీపించారు.7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు..ఈరోజు ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు లాగా చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎలాంటి బడ్జెట్ లేదు. అయినా కూడా బట్టి అన్న ఏదో రకంగా చేసి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కూడా జీతాలు ఆపలే , అలాగే పేదలకు జరిగే సంక్షేమ పథకాలు ఆపలేదు. రైతుబంధు పథకం ఆపలే.

కానీ ప్రతి సన్నాసి ఇంకా రైతుబంధు పడలేదు అంటున్నారు. గత సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు రైతుబంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 6లోపు మొత్తం రైతుబంధు పథకాన్ని పూర్తిచేసే బాధ్యత మనది. మీ అభిమానం తోటి ఫిబ్రవరి ఆఖరి రోజు కల్లా ఈ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు రైతుబంధు నగదు బ్యాంకులలో పడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రజలారా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి , మరోవైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనమంతా కూడా సరిదిద్దాలి.. ఇంకొక మాట అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటున్నారు. అవును బిడ్డ నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్ నిర్మించే మేస్త్రిని నేను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎఫ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి