KCR : కేసీఆర్ ను బుక్ చేసేందుకు రేవంత్, బండి సంజయ్‌ల ఛాలెంజ్‌లు… పార్లమెంట్ లో కేసీఆర్ పరువు పోనుందా?
కేసీఆర్ ను బుక్ చేసేందుకు రేవంత్, బండి సంజయ్‌ల ఛాలెంజ్‌లు… పార్లమెంట్ లో కేసీఆర్ పరువు పోనుందా?
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ నిజ స్వరూపంను బయట పెట్టబోతున్నట్లుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. కేసీఆర్ నిజ స్వరూపంను తెలియజేసేందుకు పార్లమెంటు స్పీకర్ అనుమతి కూడా తీసుకోబోతున్నట్లుగా ఇటీవల బండి సంజయ్ ప్రకటించాడు. బండి సంజయ్ చెప్పబోతున్న ఆ రహస్యం ఏమై ఉంటుందా అంటూ అంతా నోరు వెళ్లబెట్టి చూస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి అంతా రివీల్ చేశాడు. కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ కు హాజరు కాకుండా హాజరు అయినట్లుగా తన సంతకంను పార్లమెంటు హాజరు పట్టికలో పెట్టించే వారు అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని బండి సంజయ్ చెప్పాలనుకుంటున్నాడు అని రేవంత్ రెడ్డి సూపర్ సస్పెన్స్ విషయాన్ని తుస్సున గాలి తీసినట్లుగా చెప్పేశాడు.
KCR : బండికి రేవంత్ సవాల్…
బండి రివీల్ చేయాలనుకుంటున్న విషయాన్ని తానే రివీల్ చేసిన రేవంత్ రెడ్డి దమ్ముంటే ఆ విషయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి విచారణ చేపించగలవా అంటూ సవాల్ విసిరాడు. కేసీఆర్ కాకుండా హాజరు పట్టికలో సంతకం పెట్టింది ఎవరు అనే విషయాన్ని ఫోరెన్సిక్ టెస్ట్ కు మీ ప్రభుత్వంతో చెప్పి పంపించగలవా అన్నాడు. టీఆర్‌ఎస్ మరియు బీజేపీలు ఎప్పుడు కూడా మిత్ర పార్టీలే అని రెండు పార్టీలు గొడవ పడ్డట్లుగా నటిస్తూనే ఒక పార్టీకి మరో పార్టీ సహకరించుకుంటూ ఉంటాయని రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశాడు.
KCR : కేసీఆర్ పరువు పోయే పని చేస్తారా..
స్కూల్ పిల్లలు హాజరు పట్టికలో తప్పుడు గా హాజరు వేయించుకున్నట్లుగా పార్లమెంటు హాజరు పట్టికలో తప్పుడు సంతకం పెట్టినందుకు గాను కేసీఆర్ పరువు పోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఒక వేళ బండి సంజయ్ మరియు రేవంత్ రెడ్డిలు పట్టుబట్టి హాజరు పట్టిక విషయమై స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ విషయమై పార్లమెంట్ ఏదో ఒక వ్యాఖ్య చేయడం లేదంటే ఏదో ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే కనుక జరిగితే పరువు పోవడం ఖాయం. వీరిద్దరు ఛాలెంజ్ లు చేసుకుని కేసీఆర్ పరువు తీస్తారేమో అంటూ టీఆర్‌ఎస్ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.