Revanth Reddy : వై.ఎస్ జగన్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్… ఇలా చేస్తే కష్టమే కదా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : వై.ఎస్ జగన్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్… ఇలా చేస్తే కష్టమే కదా…!

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2024,1:00 pm

Revanth Reddy : రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరే విజయాలు పరాజయాలు అనేవి సహజంగా ఉంటాయి. అయితే వాస్తవానికి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అసలు ఏమీ చేయలేదంటే పొరపాటే. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వం చేయని వాటిని జనాల్లోకి తీసుకువెళ్తారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతిపక్షాలు ఎక్కడ చెప్పవు కానీ చేయని వాటి గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజల్లో సింపతి పొందే రాజకీయ ప్రయత్నం ఇది. మరి ప్రభుత్వం చేసిన మంచిని ఎవరు చెప్పుకోవాలి అంటే తాము చేసిన మంచిని తామే చెప్పుకోవాలని పెద్దలు అంటున్నారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మూడు దశాబ్దల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఘోరంగా పరాజయం పాలయింది. అయితే దీనికి గల ముఖ్య కారణం ఆమె చేసిన మంచి గురించి ఆమె చెప్పుకోకపోవడం. దానిని అనువుగా మలుచుకున్న విపక్షాలు ఆమె చేయని వాటిని గురించి విమర్శలు చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లారు.

ఇక ఇలాంటి తప్పే చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా చేశారు. ప్రభుత్వం చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పకుండా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ప్రజలకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని వైసిపి అధినాయకత్వం ఊరుకుంది. కానీ చివరకు విపక్షాలు దీనిని బాగా వాడుకొని అధికారంలోకి వచ్చాయని చెప్పాలి.

ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు చూసినట్లయితే జగన్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని పలువురు అంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అధికారం చేపట్టిన తర్వాత రోజు నుండే ప్రభుత్వం పై విమర్శలుపెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎవరికి టైం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదంటూ ప్రచారాలు చేస్తున్నాయి.

Revanth Reddy వైఎస్ జగన్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా చేస్తే కష్టమే కదా

Revanth Reddy : వై.ఎస్ జగన్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్… ఇలా చేస్తే కష్టమే కదా…!

మరి 6 నెలల వ్యవధిలో రేవంత్ ప్రభుత్వం ఏమి చేయలేదా అనే విషయానికి వస్తే…కేవలం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మూడు పెద్ద పథకాలను సర్కార్ అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం అలాగే మరో రెండు కీలక హామీలను నెరవేర్చారు. అయినప్పటికీ విపక్షాలు రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలుు చేయడంతో దాని ప్రభావం జనాల మీద బాగా పడిందని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లను సాధించిందంటూ చెప్పుకొస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలను తెలియజేయాలని పలువురు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు తెలియదని , ఇది రాబోయే ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తుందని చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది