Revanth Reddy : ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. గ‌ట్టి స్కెచ్చే వేశాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. గ‌ట్టి స్కెచ్చే వేశాడుగా..!

Revanth Reddy : ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయం చాలా రస‌వత్త‌రంగా సాగుతుంది. మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌ని ఓ ఊపు ఊపేసిన బీఆర్ఎస్ బొక్క‌బోర్లాపడింది. తెలంగాణ రాక‌ముందు తెలంగాణ వ‌చ్చాక జీహెచ్ఎంసీలో అస‌లు ఆ పార్టీని పెద్ద‌గా ఆద‌రించేవారు కాదు. కాని త‌ర్వాత మెల్ల‌గా వారి మెప్పు పొందేలా చేశారు.సెటిల‌ర్స్‌ని త‌న‌వైపుకి తిప్పుకునేందుకు అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేశారు కేసీఆర్. అలా మెల్ల‌మెల్ల‌గా అందరి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకున్న కేసీఆర్ మార్గంలో రేవంత్ రెడ్డి ప‌య‌నిస్తున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. హైదరాబాద్ అభివృద్ధితోపాటు […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 September 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. గ‌ట్టి స్కెచ్చే వేశాడుగా..!

Revanth Reddy : ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయం చాలా రస‌వత్త‌రంగా సాగుతుంది. మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌ని ఓ ఊపు ఊపేసిన బీఆర్ఎస్ బొక్క‌బోర్లాపడింది. తెలంగాణ రాక‌ముందు తెలంగాణ వ‌చ్చాక జీహెచ్ఎంసీలో అస‌లు ఆ పార్టీని పెద్ద‌గా ఆద‌రించేవారు కాదు. కాని త‌ర్వాత మెల్ల‌గా వారి మెప్పు పొందేలా చేశారు.సెటిల‌ర్స్‌ని త‌న‌వైపుకి తిప్పుకునేందుకు అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేశారు కేసీఆర్. అలా మెల్ల‌మెల్ల‌గా అందరి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకున్న కేసీఆర్ మార్గంలో రేవంత్ రెడ్డి ప‌య‌నిస్తున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. హైదరాబాద్ అభివృద్ధితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్​పాత్​ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

Revanth Reddy కేసీఆర్ వ్యూహంతోనే..

హైదరాబాద్‌లో అయిదేండ్ల కిందట కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌తో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి, వెంటనే బాగు చేయించాలని స్పష్టం చేశారు. రహదారులతోపాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని, అవసరమైతే జీఐఎస్, క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. మ‌రోవైపు హైడ్రాతో కూడా సెటిలర్స్‌ని త‌న‌వైపుకి తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి గ‌ట్టి స్కెచ్చే వేశాడుగా

Revanth Reddy : ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. గ‌ట్టి స్కెచ్చే వేశాడుగా..!

ఇదే స‌మ‌యంలో పిఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వివాదంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిఏసి చైర్మన్ గా నియమించడంపై చెలరేగిన వివాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలతో మరింత రచ్చగా మారింది. అరికెపూడి గాంధీకి బిఆర్ఎస్ కండువా కప్పేందుకు ఆయన ఇంటికి వెళ్తానని చెప్పిన కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు .దీంతో అరికెపూడి గాంధీ , కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడం మరింత వివాదం అయింది.ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ తెలంగాణ వ్యక్తి కాదని, ఆంధ్ర వ్యక్తి అని , కృష్ణాజిల్లా నుంచి ఆయన వలస వచ్చారని పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అరికెపూడి గాంధీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ షాక్ కు గురైంది.అయితే త‌న త‌ప్పుని దిద్దుకునే క్ర‌మంలో తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా సెటిలర్స్‌పై తనకు గౌరవం ఉందని పాడి కౌశిక్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేండ్లలో ఏ ఒక్క ఆంధ్రా సెటిలర్‌ మీద కూడా దాడి చేయలేదని గుర్తుచేశారు. గత పదేళ్లలో వారికి అద్భుతంగా స్వాగతం పలికామని తెలిపారు. ఇవాళ కూడా ఆంధ్రా సెటిలర్స్‌కు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది