Revanth Reddy : ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. కేసీఆర్ ను ఢీకొట్టడం కోసం సూపర్ ప్లాన్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. కేసీఆర్ ను ఢీకొట్టడం కోసం సూపర్ ప్లాన్?

 Authored By sukanya | The Telugu News | Updated on :6 August 2021,4:59 pm

Revanth Reddy  : తెలంగాణలో కొండగల్ అనే నియోజకవర్గం బాగా హైలైట్ అవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు ఎప్పుడు ఈ నియోజకవర్గం ఎప్పుడు పెద్దగా వార్తల్లో ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారో అప్పటినుంచి కొండగల్ రాజకీయంగా హైలైట్ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ కొడంగల్‌ నియోజకవర్గం మొదట నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చింది. ఇక 2009 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తొలిసారి టీడీపీ తరుపున బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే టీడీపీ ద్వారా గెలిచిన రేవంత్ రెడ్డి తక్కువకాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మరోసారి టీడీపీ తరుపున విజయం సాధించగలిగారు. ప్రస్తుతం టీడీపీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇలా బలమైన నాయకుడుగా మారిన రేవంత్ రెడ్డిని ఓడించడానికి టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో రేవంత్‌ని ఓడించడానికి పదునైన వ్యూహాలతో ముందుకెళ్లింది. రేవంత్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రయత్నించింది.

Revanth Reddy resigns as MP Super plan to hit KCR

Revanth Reddy resigns as MP Super plan to hit KCR

Revanth Reddy  : చాప కింద నీరులా..

ఇక కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన రేవంత్ అనూహ్యంగా కొడంగల్ బరిలో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్, మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కొడంగల్ నుంచి బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్ధుల్లో ఒకరిగా ఉన్న రేవంత్, నెక్స్ట్ ఎన్నికల్లో కొండగల్‌లో దిగి టీఆర్ఎస్‌ని చిత్తు చేయాలని అనుకుంటున్నారు.

అందుకే సైలెంట్‌గా కొడంగల్‌లో కాంగ్రెస్ శ్రేణుల ద్వారా పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అటు రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా అద్భుతమైన పనితీరు కనబర్చలేదు. పైగా ఇప్పుడుప్పుడే టీఆర్ఎస్ మీద వ్యతిరేకిత మొదలవుతోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ కొడంగల్‌లో రేవంత్‌కు అనుకూల పరిస్థితులు ఉండొచ్చని తెలుస్తోంది. కేసీఆర్ మీద గెలుపు సాధించాలంటే, ఎంపీ కన్నా, ఎమ్మెల్యేనే కీలకం కావడంతో రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే తొలుత ఎల్బీనగర్ నుంచి బరిలోకి దిగుతారన్న టాక్ వినిపించినా, రేవంత్ మాత్రం కొండగల్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది