Floods : వరదల వలన భారీ నష్టం.. మృతుల కుటుంబాలకి రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Floods : తెలంగాణలో మూడ్రోజులగా వర్షాలు కుండపోతగా వర్షాలు కురుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. భారీ వర్షాల వలన రహదారులు, రైల్వే పట్టాలు ధ్వంసమవడంతో పాటు, పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఖమ్మం జిల్లాలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది.ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాలు పంటలు నీట మునిగిపోయాయి. మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి, […]
ప్రధానాంశాలు:
Floods : వరదల వలన భారీ నష్టం.. మృతుల కుటుంబాలకి రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Floods : తెలంగాణలో మూడ్రోజులగా వర్షాలు కుండపోతగా వర్షాలు కురుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. భారీ వర్షాల వలన రహదారులు, రైల్వే పట్టాలు ధ్వంసమవడంతో పాటు, పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఖమ్మం జిల్లాలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది.ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాలు పంటలు నీట మునిగిపోయాయి. మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. శనివారం నుంచి ఆదివారం రాత్రి వరకు కురిసిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరద వల్ల రాష్ట్రంలో 15 మంది మరణించారు. ఈ నేపథ్యంలో వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Floods తక్షణ సాయం..
వరదల వలన చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్ష ప్రభావిత జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం రూ.5కోట్లు కేటాయిస్తున్నాట్లు తెలిపారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం అందించాలని అధికారులకు సూచించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లి భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యల పరిస్థితిపై ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రోడ్డు మార్గంలో అక్కడికి బయల్దేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు కేటాయించాలన్నారు.