Revanth Reddy : తెలంగాణలో 70 సీట్లు గెలువబోతున్న కాంగ్రెస్.. రేవంత్ స్కెచ్ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : తెలంగాణలో 70 సీట్లు గెలువబోతున్న కాంగ్రెస్.. రేవంత్ స్కెచ్ అదుర్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :16 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  క్షేత్రస్థాయిలో స్పెషల్ టీమ్స్ ను దించిన రేవంత్ రెడ్డి

  •  ఆ సెగ్మెంట్స్ పై ఎక్కువ దృష్టి

  •  రేవంత్ స్కెచ్ ఫలిస్తుందా?

Revanth Reddy : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 15 రోజుల్లోనే ఏం చేసినా? ఎందుకంటే.. 15 రోజుల తర్వాత ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే.. ఈ 15 రోజులు ఎన్నికల ప్రచారాన్ని పార్టీలన్నీ ముమ్మరం చేయనున్నాయి. ఇక.. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థిస్తోంది. ఈనేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. అధికార బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రకటించాయి. మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం బీఆర్ఎస్ దే గెలుపు అని ప్రకటించాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో కనీసం 70 సీట్లు గెలిచేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరికొన్ని సెగ్మెంట్ లలో అధికార బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. ఎటు చూసినా.. సునాయసంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానాలు 45 కాగా.. కొంచెం కష్టపడితే మరో 25 స్థానాల్లో ఈజీగా గెలవొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ 25 స్థానాల్లో వ్యూహాలు భారీగా రచిస్తున్నారు రేవంత్ రెడ్డి. స్పెషల్ టీమ్స్ ను కూడా పలు నియోజకవర్గాల్లో దించారు రేవంత రెడ్డి. ఆ టీమ్స్.. వచ్చే రెండు వారాల్లో నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయనున్నాయి. ప్రజల నుంచి మద్దతు కూడగట్టనున్నాయి. ముఖ్యంగా పోల్ మేనేజ్ మెంట్ పై ఆ టీమ్స్ వర్క్ చేయనున్నాయి.

Revanth Reddy : విజయవంతమైన గడప గడపకు కాంగ్రెస్

ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ పథకాలు విజయవంతం కావడంతో అదే వ్యూహంతో కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. కొంచెం కష్టపడితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఏమాత్రం బీఆర్ఎస్ కు చాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తోంది. చూడాలి మరి.. తెలంగాణలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది