బ్రేకింగ్ : ‘తెలంగాణలో పార్టీ పెడతావా? ‘ వైఎస్ జగన్ ఆమెకు గట్టి వార్నింగ్
Ys sharmila , ఏపీ రాజకీయాల్లో కాకుండా వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాలకు అంకితం చేయాలని జగన్ వ్యూహంగా తెలుస్తోంది. కేసీఆర్ సలహా మేరకు షర్మిలతో వైకాపా బాధ్యతలు తీసుకునేలా వైఎస్ జగన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. వైకాపా కనుక తెలంగాణలో యాక్టివ్ అవ్వడం మొదలు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ కు నష్టం తప్పదు అనేది కొందరి అభిప్రాయం. అదే కనుక జరిగితే కేసీఆర్ కు కలిసి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల రంగంలోకి దిగితే ఖచ్చితంగా టీఆర్‌ఎస్ కు కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అందుకే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకు రావాలని కొందరు భావిస్తున్నారు.
షర్మిలను జగన్ సైడ్ చేస్తున్నాడుః sharmila
షర్మిల తెలంగాణ రాజకీయాల గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కావాలని షర్మిలను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే షర్మిలతో తెలంగాణలో పార్టీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైజాగ్ పార్లమెంట్ స్థానంను ఎందుకు ఆమెకు ఇవ్వలేదు అంటూ వీహెచ్ ప్రశ్నించాడు. ఆమె ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడం జరిగింది. కాని వైఎస్ జగన్ మాత్రం ఆమెను మొదటి నుండి కూడా సైడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. షర్మిల ఉంటే ఖచ్చితంగా తనకు ఏదో ఒక రోజు చేటు జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ పని చేస్తున్నాడేమో అనిపిస్తుందని వీహెచ్ అన్నాడు.
తెలంగాణలో ఆమెకు అంత సీన్ లేదుః
తెలంగాణలో పార్టీ పెట్టాలని షర్మిల అనుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలపై వీహెచ్ మాట్లాడుతూ ఆమె వైఎస్ కూతురు. కనుక ఆమెలో కూడా వైఎస్‌ఆర్ రక్తం ఉంటుంది. అందుకే ఆమెకు ఏపీలో రాజకీయాలు కలిసి వస్తాయి. అసలు తెలంగాణలో ఆమె ఎలా పార్టీని పెట్టి నడిపిస్తుందని, అంత సీన్ ఆమెకు లేదు అంటూ వీహెచ్ కామెంట్ చేశాడు. షర్మిల వృదా ప్రయత్నం మానుకోవాలంటూ వీహెచ్ ఉచిత సలహా ఇచ్చాడు. కాని జగన్ అభిమానులు మాత్రం తెలంగాణలో షర్మిల గారు రంగంలోకి దిగాలని డిమాండ్ చేస్తున్నారు.