
Ys Sharmila
YS Sharmila జన్మనిచ్చిన తండ్రి దైవంతో సమానం.. అటువంటి వ్యక్తిని ఎవరైనా ఏమైనా అంటే, మండిపోద్ది.. అలాంటిది తన తండ్రిని దొంగ అంటున్నా, కనీసం స్పందించడం లేదు .. కనీసం ఖండించకపోవడం మరింత ఆజ్యానికి దారితీసింది. కన్నవారంటే, ప్రతి ఒక్కరికీ ప్రేమ, అభిమానం ఉంటుంది.. అది చెప్పనక్కరలేదు.. సమస్యలొస్తే, అదే వెల్లడవుతోంది. కానీ పదవే పరమావధిగా భావించేవారికి ఇటువంటివేవీ ఉండవని మరోసారి రుజువైంది.
కొన్నిరోజులుగా రెండు తెలుగురాష్ట్రాల మధ్య వాటర్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఏకంగా తెలంగాణ మంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని.. ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డినీ వదలకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్ నీళ్ల దొంగ అయితే.. జగన్ గజదొంగ అంటూ ఘోరంగా అవమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ కోడలినంటూ, రాజన్నరాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయాల్లోకి వస్తోన్న వైఎస్ షర్మిల తీరు అందరికీ కోపాన్ని తెచ్చిపెడుతోంది. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేది లేదు.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు గతంలో పార్టీ సన్నాహకాల్లో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన మాటల వీడియోనూ షేర్ చేశారు.
Ys Sharmila
తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని.. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా.. కొట్లాడతా..నంటూ పంచ్ డైలాగ్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.. ఇప్పుడిదే.. అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. తండ్రిని, అన్నని తిడుతుంటే, కనీసం ఖండించకుండా, ఈ ట్వీట్ చేయడమేమిటంటూ మండిపడుతున్నారు. ఏ రాజన్నరాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయాల్లోకి వస్తున్నారో.. అదే రాజన్నను తెలంగాణ నీళ్లు దోచుకున్న నీళ్లదొంగ అంటుంటే, పెదవి విప్పకపోగా.. ఈ ట్వీట్ ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు తప్ప.. మానవతా విలువలేమీ పట్టవా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. షర్మిల ట్వీట్ తో రాజన్న అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనా రెండు రాష్ట్రాల మధ్య నీటియుద్ధం.. మాటెలా ఉన్నా షర్మిలమ్మ ట్వీట్ మాత్రం అందరినీ మండిస్తోంది.. మరి ఈ మంటను ఆమె ఎలా ఆర్పుతారన్నదే కీలకంగా మారింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.