doctors : హాస్పెటల్ లో వైట్ డ్రెస్ కోడ్ ధరించేవారు.. ఆపరేషన్ సమయంలో బ్లూ అండ్ గ్రీన్ డ్రెస్ లు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?
doctors తెలుపు అనేది ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు. తెలుగు రంగు చూస్తే ఎక్కడ లేని స్వచ్ఛత కనిపిస్తుంది. అదే సమయంలో మన మెదడులో కూడా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి, ఆందోళనలు మెల్ల మెల్లగా తగ్గుతాయి. అందుకే హాస్పెటల్ లో డాక్టర్స్ కావచ్చు, నర్స్ లు కావచ్చు తెల్లటి డ్రస్సులు మాత్రమే ఎక్కువగా వాడుతారు. ఏంటది పెద్ద పెద్ద డాక్టర్స్ అయినా కానీ తెలుపుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ అదే డాక్టర్స్ ఆపరేషన్ చేసే సమయంలో మాత్రం వైట్ కాకుండా, బ్లూ,గ్రీన్ డ్రస్సులు వాడుతారు. అంటే కాకుండా తమ చుట్టూ పక్కల తెలుపు రంగు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు..

why do doctors wear blue and green dresses during operation
మనం ఏదైనా ఒక ముదురు రంగును చూసి చూసి ఒక్కసారిగా తెలుపు రంగును చూస్తే మనకేమి కొద్దీ సేపు కనిపించదు. కాసేపు ఎండను చూసి ఆ తర్వాత తెలుపు రంగును చూస్తే అప్పుడు ఏమి కనిపించకుండా కొన్ని సెక్షన్లు పాటు దృష్టికి అంతరాయం కలుగుతుందనే అనే విషయం అందరికి తెలుసు.. ఈ ఇబ్బంది ఆపరేషన్ చేస్తున్న సమయం లో రాకుండా ఉండడం కోసమే ఆపరేషన్ థియేటర్ లో తెలుపు రంగు దుస్తులను ధరించరు. ఆపరేషన్ చేసే సమయం లో వైద్యుడు చాలా అప్రమత్తం గా ఉండాలి. రక్తాన్ని కళ్ళ చూస్తున్నపుడు బెదరకుండా నిశ్చలం గా పని చేయాలి.

why do doctors wear blue and green dresses during operation
రక్తాన్ని చూసి మళ్ళీ వైట్ చూస్తే మనం చెప్పుకున్నట్లు దృష్టికి అంతరాయం కలుగుతుంది. దీని వలన వైద్యుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసమే నీలం, ఆకుపచ్చ రంగులను వాడుతారు. మరి నీలం, ఆకుపచ్చ రంగులనే ఎందుకు వాడుతారో తెలుసుకుందాం.. ఎరుపు కు ఆపోజిట్ రంగులైన బ్లూ, గ్రీన్ రంగుల దుస్తులైతే కంటికి ఎలాంటి దృష్టి అంతరాయం ఏర్పడకుండా వైద్యులు మరింత ఎక్కువ గా ఫోకస్ చేయగలుగుతారు. అందుకే.. ఆపరేషన్ చేసే సమయం లో మాత్రం నీలం, ఆకుపచ్చ రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఉంటుంది.

why do doctors wear blue and green dresses during operation
ఇది కూడా చదవండి ==> అసలు షాక్ ఎందుకొస్తుంది? వస్తే ఏం చేయాలి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> train ట్రైన్ బోగీల మీద ఉండే గీతాలకు అర్ధం తెలుసా..?
ఇది కూడా చదవండి ==> పక్షుల గుంపు “V” ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో మీకు తెలుసా…?