Sonia Gandhi : తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ.. ఆ 90 స్థానాల్లో గెలిచేలా పక్కా వ్యూహం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sonia Gandhi : తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ.. ఆ 90 స్థానాల్లో గెలిచేలా పక్కా వ్యూహం

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ

  •  ఆరోగ్యం సహకరించకున్నా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారా?

  •  కాంగ్రెస్ కు ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ వేడుకోనున్న సోనియమ్మ

Sonia Gandhi : తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం కూడా లేదు. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అస్సలు ఏ మాత్రం తగ్గడం లేదు. బిజీబిజీగా కీలక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందే ఉందని అనుకోవాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ ఏకంగా జాతీయ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తోంది. అందులోనూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తీసుకువస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై తెలంగాణ ప్రజల్లో అపారమైన నమ్మకం, ప్రేమ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని తెలంగాణ ప్రజలను మరోసారి ఓట్లు అడిగేందుకు ఏకంగా రేవంత్ రెడ్డి.. సోనియమ్మనే రంగంలోకి దించారు.

రాష్ట్రవ్యాప్తంగా 90 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 90 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయడం కోసం ఏకంగా సోనియా గాంధీని రంగంలోకి దించుతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు కూడా వస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్కే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివ కుమార్, చిదంబరం లాంటి నేతలతో పాటు సోనియా గాంధీ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇటీవల పార్టీలో చేరిన విజయశాంతి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అగ్ర నేతలు మొత్తం త్వరలోనే రాష్ట్రానికి వచ్చి ఒక్కో అగ్రనేత రాష్ట్రంలోని 5 సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.

Sonia Gandhi : తుది దశ ప్రచారానికి సోనియా గాంధీ

ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోను ప్రతి గడపకు చేర్చడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ మూడో సారి సీఎం అయితే వచ్చే నష్టాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ఇక.. తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేతల ప్రచారం పూర్తయ్యాక.. తుది దశ ప్రచారానికి సోనియా గాంధీ రాబోతున్నారు. సోనియా గాంధీ కూడా తెలంగాణలో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోనియా గాంధీ తెలంగాణకు రాలేకపోయినా ప్రత్యేక వీడియోతో తెలంగాణలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని సోనియా గాంధీతో చెప్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది