Pranay Case Judgement : ప్రణయ్ హత్య కేసు.. ఇదంతా అమృత వల్లనే జరిగిందంటున్న ఆమె సోదరి..!
ప్రధానాంశాలు:
Pranay Case Judgement : ప్రణయ్ హత్య కేసు.. ఇదంతా అమృత వల్లనే జరిగిందంటున్న ఆమె సోదరి..!
Pranay Case Judgement : తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేసు విషయంలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఏ 2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం విధించింది.

Pranay Case Judgement : ప్రణయ్ హత్య కేసు.. ఇదంతా అమృత వల్లనే జరిగిందంటున్న ఆమె సోదరి..!
Pranay Case Judgement : మంచి తీర్పు..
కేసులో A1 గా మారుతీ రావు ఉన్నప్పటికీ ఈయన మరణించారు. అయితే ఆ తర్వాతA2 గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించగా, అమృత బాబాయి A6 గా శ్రవణ్ ఉన్నారు .ఆయనకి జీవిత ఖైదీగా కోర్టు విధించింది.దీంతో శ్రవణ్ కుటుంబం కోర్టు ముందు ఆందోళనకి దిగింది. పోలీసులులతో సైతం శ్రవణ్ కుటుంబ సభ్యులు తీవ్రమైన వాగ్వాదానికి కూడా దిగారు
తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్తె ఏడుస్తూ ఎమోషనల్ గా మాట్లాడింది.ఈ కేసులో ఏ సంబంధం లేకుండా తన తండ్రిని అమృత కావాలని ఇరికించింది అంటూ ఆరోపణలు చేసింది అమృత చెల్లి. అయితే ప్రణయ్ మర్డర్ జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్నటువంటి ఏపీ రంగనాథ్ కోర్టు తీర్పు పైన ప్రశంసలు కల్పించారు.. నేరస్తులకు శిక్ష పడడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం ఆయన అన్నారు.