Amrutha : ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక తీర్పు..అమృత పై నెటిజన్లు ఫైర్
ప్రధానాంశాలు:
Amrutha : ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక తీర్పు..అమృత పై నెటిజన్లు ఫైర్
Amrutha : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పప్రణయ్రువు హత్య కేసులో కోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రధాన నిందితుడికి మరణశిక్ష విధించగా, మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యం అయినప్పటికీ, అప్పటినుండి పోరాడుతున్న తమ కన్నీళ్లకు ఇదే నిజమైన న్యాయం అని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. మరోవైపు, ప్రణయ్ భార్య అమృత కోర్టు తీర్పు అనంతరం ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు కానీ, నాటి ఘటనలో నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Amrutha : ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక తీర్పు..అమృత పై నెటిజన్లు ఫైర్
కాగా కోర్టు తీర్పు అనంతరం అమృత సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “Rest In Peace” అని మాత్రమే పోస్ట్ చేయడం గమనార్హం. అలాగే అమృత తన సోషల్ మీడియా అకౌంట్ పేరును “అమృత ప్రణయ్” నుండి “అమృత వర్షిని” గా మార్చేయడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత కాలం ప్రణయ్ కోసం బతుకుతున్నట్టుగా చెప్పిన అమృత ఇప్పుడు తన పేరులోంచి ప్రణయ్ పేరును తొలగించడం ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరికొంత మంది అయితే “తన కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్న సూచన” అని అభిప్రాయపడుతున్నారు. కొంత మంది “ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం, ఎవరికీ నిందించడం తగదు” అని చెబుతుంటే, మరికొంత మంది “ఇంతకాలం ప్రణయ్ కోసం పోరాడినట్టు చూపించి ఇప్పుడు అతని పేరును తొలగించడం న్యాయమా?” అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తీర్పు తర్వాత అమృత చేసిన పనికి విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అమృత ఏమైనా స్పందిస్తుందా..? అనేది చూడాలి.