Farmers : రైతన్నలకు తీపి కబురు… అకౌంట్ లోకి 15 వేలు జమ…
ప్రధానాంశాలు:
Farmers : రైతన్నలకు తీపి కబురు... అకౌంట్ లోకి 15 వేలు జమ...
Farmers : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఈ ఆరు హామీలు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు అనుకూలంగా ప్రభుత్వం వచ్చిన తరువాత ఫస్ట్ రోజు నుండి ఈ ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఆరు హామీలతో పాటుగా మహాలక్ష్మి హామీ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం,ప్రస్తుతం ఐదు హామీలను అమలు చేస్తూనే ఉన్నది. కానీ ఈ ఆరు హామీల పథకం రైతు భరోసా వలన రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15000 ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే రైతులకు ఇచ్చే మూలధన సాయాన్ని కూడా ఇంకా లక్షకు పెంచుతాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.అయితే ఎకరాకు రూ.15,000 ఇస్తుండగా, ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు కూడా చర్యలను చేపట్టారు. ప్రస్తుతం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10,000 రైతులకు అకౌంట్ లో అందజేయడం జరిగింది. దీని కోసం మరో రూ.5000 పెంచి రైతు ఖాతాలో మొత్తం కలిపి రూ.15000 జమ చేయటం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు కోడ్ అనేది ఉంటుంది..
ఈ ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత వెంటనే ఆ డబ్బులను జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చే వానాకాలం నుండి రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తాం అని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈసారి ఈ పెట్టుబడి సాయం అందరికీ కాక పంటలు వేసిన రైతులకు మాత్రమే ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతు, రైతులకు ఈసారి రైతు భరోసా ఇస్తున్నారు. కానీ కౌలు చేసే రైతులు నుండి అఫిడవిట్ తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బు అనేది వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అయితే అన్ని పార్టీలతో పాటుగా రైతులు మరియు రైతు సంఘాల అభిప్రాయం కూడా తీసుకునేందుకు శాసనసభలో రైతు మరియు రైతు సంఘాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి…
రైతు రుణమాఫీ పథకాన్ని చాలా భద్రతగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే రూ. 2 లక్షల రుణాలను మాఫి చేయాలి అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని తెలిపారు. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టా రుణాలు,వాస్తవ లెక్కలను కూడా అందించాలి అని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించామని తెలిపారు. దాని తర్వాత రూ.2 లక్షల వరకు కూడా రైతులకు రుణాలు అనేవి మాఫీ అవుతాయి అని తెలిపారు…