Talasani : కామారెడ్డిలో కేసీఆర్ పోటీపై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు?
Talasani : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రజల్లోకి వెళ్తున్నాయి. తమకే ఓటేయాలని బలంగా ప్రజలను కోరుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో రెండు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ గెలిచేందుకు బీఆర్ఎస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది.
ఈసందర్భంగా కామారెడ్డిలో పర్యటించిన మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఏరికోరి కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని మంత్రి తలసాని అన్నారు. ఇప్పటికే కామారెడ్డి అభివృద్ధి చెందిందని, త్వరలో 8 కోట్లతో కామారెడ్డిలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తలసాని అన్నారు.అయితే.. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న షబ్బీర్ అలీ కేసీఆర్ పై సీరియస్ అయ్యారు. ఏరికోరి కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ కు కామారెడ్డి ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం. కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే ప్రారంభం కానుందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కామారెడ్డి గుర్తొచ్చిందా? ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారు..
Talasani : కామారెడ్డి నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం
అంటూ షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. 1500 కోట్లతో ప్రగతి భవన్, 15 వేల కోట్లతో సచివాలయం కట్టుకొని పేదలకు మాత్రం నాణ్యత లేని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలంటే ఎందుకు అంత చులకన అని షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి భూముల మీద కేసీఆర్ కన్ను పడిందని అందుకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు.