Teenmaar Mallanna : సాగర్ రేసులో మల్లన్న ఉన్నట్టా? లేనట్టా? బీజేపీలో చేరుతున్నట్టా? చేరనట్టా?

0
Advertisement

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న… ప్రస్తుతం తెలంగాణలో జోరుగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ పేరులో ఏముందో కానీ… యూత్ ఎక్కువగా ఈ పేరుకు అట్రాక్ట్ అయిపోతున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ మోస్ట్ గెలిచేసినట్టే మల్లన్న. టీఆర్ఎస్ పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చిన తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులే కాదు.. యావత్ తెలంగాణ లోకం జేజేలు పలుకుతోంది. దీంతో తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం తీన్మార్ మల్లన్న వైపు చూస్తున్నాయి ఒక్క టీఆర్ఎస్ పార్టీ తప్ప.

teenmaar mallanna to join in bjp
teenmaar mallanna to join in bjp

ఇప్పటికే పలు పార్టీలు తీన్మార్ మల్లన్న దగ్గరకు వెళ్లి… ఆయనతో మంతనాలు జరిపాయి. కొందరు సీనియర్ నేతలు మల్లన్నతో చర్చించినప్పటికీ.. తాను ఏ పార్టీలో చేరనని.. సాగర్ ఉపఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు.

అయినప్పటికీ… తీన్మార్ మల్లన్న సాగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాగర్ ఉపఎన్నిక నామినేషన్ కు ఇంకా వారం గడువు ఉండటంతో అప్పటి వరకు తీన్మార్ మల్లన్న మనసు మార్చుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

Teenmaar Mallanna : బీజేపీ వైపే మొగ్గు చూపుతున్న మల్లన్న?

ఒకవేళ తీన్మార్ మల్లన్న మనసు మార్చుకుంటే ఏ పార్టీలో చేరుతారు? అనేదానిపై క్లారిటీ లేదు కానీ… మల్లన్న మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా తీన్మార్ మల్లన్న వైపే మొగ్గు చూపుతోంది. దీంతో తీన్మార్ మల్లన్న కూడా బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.

బీజేపీలో ప్రస్తుతం అంత బలమైన నాయకుడు లేకపోవడంతో.. తీన్మార్ మల్లన్నను చేర్చుకొని… సాగర్ టికెట్ ను ఆయనకు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోందట.

కానీ… తీన్మార్ మల్లన్నకు సాగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదు… అయినప్పటికీ.. బీజేపీ ఎలాగైనా తీన్మార్ మల్లన్నను ఒప్పించి పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తీన్మార్ మల్లన్నకు తెలంగాణ వ్యాప్తంగా ఫుల్లు క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా లేదు. అందుకే… బీజేపీతో పాటు.. కాంగ్రెస్ పార్టీ కూడా మల్లన్నను పార్టీలో చేర్చుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. మరి చూద్దాం… మల్లన్న బీజేపీలో చేరుతారా? లేక వేరే పార్టీలో చేరుతారా? అని.

Advertisement