Teenmar Mallanna : ఇందుకే అంటారు… రాజకీయంలో శాశ్వత శత్రువు ఉండరు అని..!
ప్రధానాంశాలు:
Teenmar Mallanna : ఇందుకే అంటారు... రాజకీయంలో శాశ్వత శత్రువు ఉండరు అని..!
Teenmar Mallanna : తెలంగాణ Telangana అసెంబ్లీలో సంచలన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే బహిష్కృతమైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) అనూహ్యంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని కోరుతూ మల్లన్న బీఆర్ఎస్ నేతలకు మెమొరాండం అందజేశారు. అంతేకాక బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేతలను కోరారు.

Teenmar Mallanna : ఇందుకే అంటారు… రాజకీయంలో శాశ్వత శత్రువు ఉండరు అని..!
Teenmar Mallanna మల్లన్న ప్రయాణం బిఆర్ఎస్ వైపా..?
మరోవైపు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండయ్యాక ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నా, మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అతనిపై కఠిన నిర్ణయం తీసుకుంది.
తీన్మార్ మల్లన్న భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగనుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన కొత్త దారిలో వెళ్లే అవకాశాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం ఆయన ఆ పార్టీలో చేరతారా? లేదా కొత్త రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.