Big Breaking : ఒకే దరఖాస్తులో ఆరు గ్యారెంటీలు.. రేపటి నుంచి అప్లై చేసుకోండి.. అప్లికేషన్ ఫామ్ ఇదే..!
ప్రధానాంశాలు:
అన్ని స్కీమ్స్ కు ఒకేసారి దరఖాస్తు
డిసెంబర్ 28 నుంచి దరఖాస్తు ప్రారంభం
జనవరి 6 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
Telangana Six Guarantee Schemes Launch : ఎన్నికల ముందు మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. దానిలో భాగంగానే గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిసెంబర్ 27న అంటే ఈరోజే ఆరు గ్యారెంటీ హామీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో లాంచ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి అనంతరం ఈ స్కీమ్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
అభయహస్తం స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ప్రజా పాలన దరఖాస్తు పేరుతో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం ఒకేసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ను నింపి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 28 నుంచి 6 జనవరి, 2024 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు.. నేరుగా సచివాలయానికి చేరుకొని అక్కడ ఆభయహస్తం స్కీమ్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటి యజమాని పేరు, కులం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్, ఆ తర్వాత మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సాయం, 500 గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు, రైతు భరోసా కింద రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు, వివరాలు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆధార్ కార్డు జీరాక్స్, తెల్ల రేషన్ కార్డు జీరాక్స్ జత చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి