Telangana Election Schedule 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ రోజే పోలింగ్.. మూడు రోజుల తర్వాత ఫలితాలు
Telangana Election Schedule 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు షెడ్యూల్ విడుదలైంది. తాజాగా ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్నికల పోలింగ్ డేట్ వివరాలను ప్రకటించారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ కు చివరి తేదీ నవంబర్ 10. నామినేషన్ల స్క్రూటినీ తేదీ నవంబర్ 13 కాగా.. నామినేషన్ విత్ డ్రాకు చివరి తేదీ నవంబర్ 15. తెలంగాణలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే రోజు అంటే నవంబర్ 30, 2023 గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం.. 3 డిసెంబర్ 2023న ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. 5 డిసెంబర్ 2023 లోనూ తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఐదు రాష్ట్రాలు కలిపి మొత్తం 679 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఈరోజు నుంచే అంటే అక్టోబర్ 9 నుంచే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. అంటే తెలంగాణలో కూడా ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. తెలంగాణలో నవంబర్ 30 న ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్ లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాంలో నవంబర్ 7న జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న జరగనున్నాయి. ఛత్తీస్ ఘడ్ లో రెండు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నవంబర్ 7న ఫస్ట్ విడత, నవంబర్ 17న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మిగితా రాష్ట్రాల్లో పోల్చితే తెలంగాణ, చత్తీస్ ఘడ్ లో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. రాజస్థాన్ లో 5.25 కోట్ల మంది, మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు ఉండగా.. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్ ఘడ్ లో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.