Telangana Assembly Elections Results 2023 : తెలంగాణలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. ఇదిగో లిస్టు.. గెలిచే పార్టీ ఇదే?
ప్రధానాంశాలు:
జిల్లాల వారీగా ఎన్నికల ఫలితాలను తీసుకుంటే ఏ పార్టీ గెలవబోతోంది?
ఏ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నారు?
డిసెంబర్ 3న వెలువడనున్న ఫలితాలు
Telangana Assembly Elections Results 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కానీ.. ఎవరికి ఓట్లేశారు.. ఎవరిని గెలిపించబోతున్నారు అనే విషయం తెలియాలంటే మాత్రం డిసెంబర్ 3 దాకా ఆగాల్సిందే. అయితే.. తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు.. ఇతర సర్వే సంస్థలు కావచ్చు.. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలువబోతోంది అనే దానిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కో విధంగా ఉన్నా.. తెలంగాణలో ఈసారి ఏ పార్టీ గెలుపు అనే దానిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు జనాలు. ముఖ్యంగా పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండటం.. కాంగ్రెస్ కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర్లోనే సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలుస్తుండటంతో ఈసారి ఫలితాల కోసం అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది కేవలం అంచనా మాత్రమే. ఇది నిజం అని కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం చెబుతున్న లిస్టు మాత్రమే ఇది. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు లేదా 5 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు 3 లేదా 4, బీజేపీకి 1 లేదా రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే ఆదిలాబాద్ లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి 4 అయితే కన్ఫమ్ అని తెలుస్తోంది. కాంగ్రెస్ కి 4 నుంచి 5, బీజేపీకి 1 నుంచి 2 వరకు వచ్చే చాన్స్ ఉంది.
Telangana Assembly Elections Results 2023 : ఉమ్మడి కరీంనగర్ లో దూసుకుపోనున్న హస్తం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే.. అక్కడ ఉన్న నియోజకవర్గాలు 9. అందులో కాంగ్రెస్ పార్టీకి 4, బీఆర్ఎస్ పార్టీకి 3 లేదా 4 సీట్లు, బీజేపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం హస్తం పార్టీ దూసుకుపోనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 7 నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచే చాన్స్ ఉంది. ఇక.. బీజేపీ 2 సీట్లు గెలిచే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో చూసుకుంటే బీజేపీకి ఈసారి ఉన్న ఒక్క సీటు కూడా పోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు 4 నుంచి 5 సీట్లు, కాంగ్రెస్ కు 4 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఇక్కడ జీరో అయ్యే చాన్స్ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లు ఉండగా.. అక్కడ బీఆర్ఎస్ పార్టీ హవా ఉండనుంది. బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు, బీజేపీకి 1 సీటు వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా.. అందులో బీఆర్ఎస్ పార్టీకి 4 నుంచి 5, కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3, బీజేపీకి 1 నుంచి 2, ఎంఐఎం పార్టీకి 6 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగనుంది. ఎందుకంటే.. ఇక్కడ బీఆర్ఎస్ కు 4 నుంచి 5 సీట్లు మాత్రమే రానున్నట్టు తెలుస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 9 నుంచి 10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది.నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ హవా రానుంది. ఎందుకంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు రానుండగా.. బీఆర్ఎస్ కు 2 సీట్లు మాత్రమే రానున్నాయి. వరంగల్ లో ఉన్న 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు 6, కాంగ్రెస్ కు 6 రానున్నాయి. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా, బీఆర్ఎస్ కు ఒకటి, కాంగ్రెస్ కు 8, సీపీఐకి 1 రానున్నాయి.