Telangana BJP : బాబ్బాబు.. టికెట్లు ఇస్తాం రండి.. మాకొద్దుపో అంటున్న బీజేపీ సీనియర్ నేతలు.. అసలు ఏం జరుగుతోంది?
Telangana BJP : తెలంగాణలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ నుంచి వెయ్యికి పైనే దరఖాస్తులు వచ్చాయి.ఇక.. కాంగ్రెస్ లాగానే తెలంగాణ బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికను స్టార్ట్ చేసింది. దాని కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. చాలామంది కొత్త నేతలే బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు కానీ..
సీనియర్లు మాత్రం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు.అయితే.. బీజేపీ సీనియర్ నేతలు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దరఖాస్తు చేసుకోకపోతే టికెట్ ఇవ్వరా అని కాంగ్రెస్ నేతలు భావించినట్టుగానే బీజేపీ నేతలు కూడా అనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు. బీజేపీలో ఫీజు కూడా లేదు. అయినా కూడా సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 10 లోపు అందరూ దరఖాస్తు చేసుకోవాలని హైకమాండ్ సూచించింది. కానీ.. కొందరు సీనియర్లు దరఖాస్తుకు దూరంగా ఉన్నారు. దరఖాస్తు చేసుకోకపోయినా తమకు టికెట్ ఇస్తారనే ధీమాలో సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అగ్ర నేతలు కూడా ఉన్నారు.
Telangana BJP : ఎందుకు బీజేపీ సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకోవడం లేదు
వాళ్లు ఫలానా నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఫిక్స్ అయినప్పటికీ దరఖాస్తు మాత్రం చేసుకోవాలని హైకమాండ్ సూచిస్తోంది. ఇంకా మూడు రోజులే గడువు ఉండటంతో సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.