Womens : రాఖీ పౌర్ణమి స్పెషల్.. మహిళలకు గుడ్‌న్యూస్.. 4 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం..!
ప్రధానాంశాలు:
Womens : రాఖీ పౌర్ణమి స్పెషల్.. మహిళలకు గుడ్‌న్యూస్.. 4 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం..!
Womens : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ( SHGs ) ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించనుంది.

Womens : రాఖీ పౌర్ణమి స్పెషల్.. మహిళలకు గుడ్‌న్యూస్.. 4 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం..!
Womens : కీలక నిర్ణయం..
ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 1,000 మెగావాట్లు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారుగా రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇందులో 10% ఖర్చు మహిళా సంఘాలు భరిస్తే, మిగతా 90% బ్యాంకు రుణాల రూపంలో లభిస్తుంది. మహిళా సంఘాలకు ఉన్న 99% రుణ చెల్లింపు రికార్డు బ్యాంకులను ప్రోత్సహించడంలో కీలకంగా మారింది.
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, నీటిపారుదల శాఖ భూములు, గిరిజన భూములు వంటివి ఇప్పటికే గుర్తింపు దశలో ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు, అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టెండర్ల ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు ప్రతి మెగావాట్‌కు సంవత్సరానికి రూ.30 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా సంఘాలు స్థిరమైన ఆదాయ వనరును పొందగలవు.ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతతోపాటు, పర్యావరణ అనుకూల శక్తి ఉత్పత్తి పెరుగుతుంది.