Telangana : పేదవారికి తెలంగాణా ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్లోకి 5 లక్షలు..!
ప్రధానాంశాలు:
Telangana : పేదవారికి తెలంగాణా ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్లోకి 5 లక్షలు..!
Telangana : తెలంగాణాలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7కి ఏడాది పాలన ముగిస్తారు. ఈ ఏడాది కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం, 200 యూనిట్ల కరెంట్ ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ లాంటివి ఇస్తున్నారు. ఈ హామీలతో పాటు ఇందిర మహిళా శక్తి పథకంలో మహిళలతొనే క్యాంటీన్లు, వ్యవసాయ యంత్రాలు, సోలార్ పవర్ ప్లాంట్స్, స్వయం సహాయక బృదాల్లో సహ్యులైన మహిళల ద్వారా ఆర్టీసీ బస్సులు కొన్ని అద్దెకిచ్చేలా చేస్తున్నారు. స్త్రీ నిధి పథకం లో భాగంగా రుణాలు అందిస్తున్నారు. పథకాలు బాగానే ఉన్నా వాటి అమలు సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ సగం మందికే అవగా మిగతా వారికి కాలేదు. ఉచిత విద్యుత్, వంటగ్యాస్ సబ్సీడీ కూడా కొందరికి రాలేదు. వీటి వల్ల ప్రభుత్వంపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి టైం లోనే ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Telangana మౌలిక వసతుల ఏర్పాటు కోసం..
అందులో ఒకటి డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం 196 కోట్లు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో అరైన కరెంటు, తాగునీరు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అలాంటి ఇళ్లకు మరమత్తులు చేస్తున్నారు. ఇలాంటి ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేలు దాకా ఉన్నాయని తెలుస్తుంది.
ఇక మరో శుభవార్త ఏంటంటే.. ఇందిరమ్మ ఇళ్లకు సంబందించి లబ్దిదారులకు 5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించాలనుకునే వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుంది. ఇందుకోసం వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ చేస్తరు. ఐతే 5 లక్షలు ఒకేసారి కాకునా 4సార్లుగా ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణా వ్యాప్తంగా ఇలా కొంత ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక సాయం కావాల్సిన వారు ప్రభుత్వం నుంచి దీన్ని పొందే అవకాశం ఉంటుంది. ఐతే దీనికి సంబందించిన విధివిధానాలు సరి చూసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది.