School Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవులే సెలవులు.. దసరా, దీపావళి, సంక్రాంతి సెలవుల ప్రకటన
School Holidays : ఇది పండుగల సీజన్. ఒక పండుగ తర్వాత మరో పండుగ వస్తూనే ఉంటాయి. దసరా పండుగ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి.. స్కూల్ విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగానే ఎక్కువ సెలవులు ఇస్తారు ఇక్కడ. ఈసారి బతుకమ్మ, దసరా రెండు పండుగలను కలుపుకొని 13 రోజుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులను కూడా ప్రకటించింది. దసరాకు 13 రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. దీపావళికి మాత్రం ఒక్క సెలవు మాత్రమే ప్రకటించింది.
దసరాకు అక్టోబర్ 13 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించగా.. దసరా తర్వాత వచ్చే దీపావళికి ఒక్క రోజు సెలవు ఇచ్చింది. ఇక డిసెంబర్ లో వచ్చే క్రిస్ మస్ పండుగకు ఐదు రోజుల సెలవును ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు సెలవులు ప్రకటించింది. అయితే.. ఆ సెలవులు కేవలం క్రిస్టియన్ స్కూళ్లకే వర్తిస్తాయి. ఇతర స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 25న క్రిస్ మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఇక.. ఆ తర్వాత వచ్చే సంక్రాంతి పండుగకు మాత్రం ఆరు రోజుల సెలవును ప్రకటించింది. బోగి, సంక్రాంతి కనుమ మూడు పండుగలకు 6 రోజుల సెలవును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
School Holidays : ఏపీలో కూడా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఏపీలో కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దసరా సందర్భంగా 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి 24 వరకు సెలవులను ప్రకటించింది. క్రిస్మస్ కు 5 రోజులు, సంక్రాంతికి జనవరి 12 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.