Rythu Bharosa : రైతులకి తీపి కబురు.. వారి ఖాతాలలో 12వేల రూపాయలు జమ..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : రైతులకి తీపి కబురు.. వారి ఖాతాలలో 12వేల రూపాయలు జమ..!
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకు శుభవార్తలు farmers Good News అందిస్తూనే ఉంది. రైతుభరోసా పథకం rythu bharosa కింద ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రీసెంట్‌గా నిధులు విడుదల చేశారు. మొత్తం 17.03 లక్షల మంది రైతుల farmers ఖాతాల్లో ఈ నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక ఇప్పుడు Rythu Bharosa రైతు భరోసా పంట పెట్టుడి సాయం డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఎకరం లోపు రైతులకు డబ్బులు జమ చేయగా.. తాజాగా రెండు ఎకరాల లోపు భూమి ఉన్నవారికి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇవాళ లేదా రేపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
![Rythu Bharosa రైతులకి తీపి కబురు వారి ఖాతాలలో 12వేల రూపాయలు జమ](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Rythu-Bharosa1.jpg)
Rythu Bharosa : రైతులకి తీపి కబురు.. వారి ఖాతాలలో 12వేల రూపాయలు జమ..!
Rythu Bharosa : ఎప్పుడు జమ..
ఇటీవల ఒక ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఇక ఇవాళ 2 ఎకరాల లోపు భూమి ఉండి, సాగు చెయ్యడానికి అనుకూలంగా ఉంటే.. వారి అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. ఎకరానికి రూ.6,000 చొప్పున ఒక్కో రైతు అకౌంట్‌లో మొత్తం రూ.12,000 జమ చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 వేలు రైతుబంధు పేరుతో రెండు విడతల్లో ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్నే రైతు భరోసాగా మార్చి అదనంగా రెండు వేలు ఇస్తోంది. మెుత్తం రూ.12 వేలు రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సాగులో ఉన్న భూములకు ఈ సాయం అందించనున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున ఈ పథకం ప్రారంభమవగా, మొదటి విడత నిధులు జనవరి 27న విడుదలయ్యాయి. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ఫిబ్రవరి 5న తొలి విడతలో నిధులు విడుదలయ్యాయి. మెుత్తం 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. సిద్దిపేటలో 1.20 లక్షల మంది రైతులు , మెదక్ జిల్లాలో 1.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి.. సోమ, మంగళవారం పట్టొచ్చు. అందువల్ల ఇవాళ ఏ రైతు కైనా మనీ రాకపోతే, మంగళవారం సాయంత్రం వరకూ ఎదురుచూడాలి. అప్పటికీ రాకపోతే, బుధవారం బ్యాంకుకి వెళ్లి అడగొచ్చు లేదా దగ్గర్లోని వ్యవసాయ అధికారిని కలిసి అడగొచ్చు.