Telangana Govt : రేవంత్ సర్కార్ డబల్ ధమాకా… రేషన్ కార్డులు జారీ… మహిళలకు నెలకు రూ.2500…!
Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రమంతటా పేద ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగానే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారం సాధించిన వెంటనే తొలుత తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించారు. ఆ తర్వాత కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ లిమిట్ ను 10 లక్షల వరకు పెంచారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ పై ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడింది.
అలాగే ఇటీవల మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నారు. దీంతోపాటు 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా ఇప్పటికే ప్రారంభించారు. అయితే గత మార్చి నెలలోనే ఈ రెండు పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.అయితే ఇప్పుడు ఇదే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పథకాన్ని అమలు చేసి దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. అయితే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా పేద మహిళలకు నెలకు 2500 ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పథకాన్ని జూలై లేదా ఆగస్టు నుంచి అమలు చేయాలని సర్కార్ ఆలోచన చేస్తుందట. అయితే ఈ పథకం అమలులో తెల్ల రేషన్ కార్డు అనేది కీలకంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రతినెల 2500 రూపాయలు అందేలా చేయనున్నారు.18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఈ స్క్రీమ్ వర్తించేలా చూస్తున్నారు.

Telangana Govt : రేవంత్ సర్కార్ డబల్ ధమాకా… రేషన్ కార్డులు జారీ… మహిళలకు నెలకు రూ.2500…!
అయితే ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింకు ఉండటంతో ముందుగా తెల్ల రేషన్ కార్డు జారీ చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద 2500 అందించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ అనేది రాబోయే రెండు నెలల్లోనే పూర్తి కాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది తెల్ల రేషన్ కార్డుల కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితులలో ముందుగా తెల్ల రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత మహిళలకు 2,500 స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుండడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు జోష్ లో ఉన్నారు.