Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్… రైతు భరోసా కీలక ప్రకటన..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్... రైతు భరోసా కీలక ప్రకటన..!
Rythu Bharosa : తెలంగాణ Telangana ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేశారు. మెుత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 22 వేల కోట్లు జమ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరాకు రూ. 10 వేలు రెండు విడతల్లో జమ చేసేవారు. ఈ పథకాన్నే రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు రూ. 15 వేలు ఇచ్చేందుకు రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది…
Rythu Bharosa మంత్రి కీలక వ్యాఖ్యలు..
తాజాగా రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా ని ఏ రైతుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.. ఇప్పటికే రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7,625 వేల కోట్లు ఇచ్చిందని, రైతు రుణమాఫీ పథకం కింద రూ. 21 వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన ప్రతి రైతుకూ, రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం అనేక సందేహాలు కలిగిస్తుంది.. ఇలా మాట మార్చడానికి ప్రధాన కారణం.. గైడ్‌లైన్స్ ఇంకా రూపొందించకపోవడమే. ఎవరిని అర్హులుగా చెయ్యాలో, ఎవర్ని అనర్హులుగా చెయ్యాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. అవతల ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఆదివారం (డిసెంబర్ 30) సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు అధికారులతో సమావేశమై చర్చించారు. గతంలో మాదిరగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కానివ్వమని చెప్పారు..