Indiramma Housing Scheme : గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
ప్రధానాంశాలు:
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల Indiramma Housing Scheme నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం Telangana కీలక ప్రకటన చేసింది. హౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క mallu bhatti vikramarka ఈ ఆదేశాలు ఇచ్చారు. బడ్జెట్ సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు.
ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ Indiramma Housing Scheme దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి ఇండ్ల నిర్మాణంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం అవుతుందని వెల్లడించారు. డిజిటల్ భూ సర్వేకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

Indiramma Housing Scheme : గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
Indiramma Housing Scheme నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇండ్లు లేని పేదలందరికీ గూడు అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు వారి అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్‌లో చూసుకోవచ్చు. ఇందుకు ఇందిరమ్మ ఇళ్ల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Indiramma Housing Scheme దరఖాస్తు స్థితి తెలుసుకునేదెలా?
ఇందిరమ్మ ఇళ్ల అధికారిక వెబ్‌సైట్ indirammaindlu.telangana.gov.in లోకి వెళ్లాలి. హోం పేజీలో “More” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. “Application Search” పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలు నమోదు చేయాలి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్, FSC (Food Security Card) నెంబర్ ఎంటర్ చేసి.. “Go” బటన్‌ను నొక్కితే మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. మీ అప్లికేషన్ L1 (మొదటి ప్రాధాన్యత), L2 (రెండో ప్రాధాన్యత), L3 (తదుపరి ప్రాధాన్యత) కేటగిరీలో ఉందో తెలుసుకోవచ్చు. ఏదైనా అభ్యంతరాలుంటే “Raise Grievance” ఆప్షన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ప్రొసిడింగ్ కాపీలు అందుకున్న వారందరూ నిర్మాణంపై దృష్టి పెట్టాలి.