Free Sand : శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ..!
ప్రధానాంశాలు:
Free Sand : శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ..!
Free Sand : తెలంగాణ ప్రభుత్వం Telangana ఇందిరమ్మ indiramma housing scheme లబ్ధిదారులకు శుభవార్త అందించింది. ఇంటి నిర్మాణానికి సహాయం చేయడంతో పాటు ఉచితంగా ఇసుకను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని ఆదేశించింది.ఇసుక విధానంపై సోమవారం Telangana Govt తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వడంపై చర్చించింది.
![Free Sand శుభవార్త ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Free-Sand.jpg)
Free Sand : శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ..!
Free Sand బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
ఈ సమావేశంలో అధికారులతో కీలక చర్చలు జరిపారు. అనంతరం అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు చెప్పారు.
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. అధికారులు ఇసుక రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ‘ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించాలి. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి’ అని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.