Telangana Ministers : ఆ నలుగురికి మంత్రి పదవి ఫిక్స్..!
ప్రధానాంశాలు:
Telangana Ministers : ఆ నలుగురికి మంత్రి పదవి ఫిక్స్..!
Telangana Ministers : తెలంగాణ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. తాజాగా మరోసారి ఈ విషయంపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.

Telangana Ministers : ఆ నలుగురికి మంత్రి పదవి ఫిక్స్..!
Telangana Ministers వారెవరు అంటే..
ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో కొలువుదీరిన తర్వాత.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా..ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మంత్రివర్గంలో మెుత్తం 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉండగా.. ఆరు ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్‌మెంట్, విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి.
అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. బీసీ సామాజిక వర్గం నుండి వాకిటి శ్రీహరి, మైనార్టీ నుండి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఎస్సీ నుండి వివేక్ పేర్లని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. బిసీ సామాజిక వర్గం నుండి మరొకరికి మంత్రి పదివి ఇవ్వాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేల జాబితాని అదిష్టానం పరిశీలించినట్టు టాక్