Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్.. ఇక ఇలా చెక్ చేసుకోండి మరి..!
ప్రధానాంశాలు:
Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్.. ఇక ఇలా చెక్ చేసుకోండి మరి..!
Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులంటూ ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ.. మెస్సెజ్‌లు కూడా పంపించింది..

Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్.. ఇక ఇలా చెక్ చేసుకోండి మరి..!
Ration Cards ఇలా చేయండి..
ఇక కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి తమకు రేషన్ కార్డు వస్తుందో లేదో, రేషన్ కార్డు వస్తే ఎన్ని రోజుల్లో వస్తుందో, అసలు తమ దరఖాస్తు ఎవరి వద్ద ఉందో తెలియక గందరగోళానికి చాలామంది గురవుతారు. అయితే ఇకపై ఆ గందరగోళం లేకుండా అన్నింటిని ఆన్లైన్ లోనే చూసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
దరఖాస్తు చేసుకున్న వారు మీ సేవాలో ఇచ్చిన రిఫరెన్స్ నంబర్ ఆధారంగా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు… లబ్ధిదారులు రేషన్ కార్డు నెంబర్ ప్రకారంతో అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. దీనిలో కార్డులోని కుటుంబసభ్యుల పూర్తి వివరాలు కనిపిస్తాయి.. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత.. రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత మీ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.