Ration Dealers : 1,629 రేషన్ డీలర్ల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Dealers : 1,629 రేషన్ డీలర్ల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 August 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Dealers : 1,629 రేషన్ డీలర్ల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్‌..!

Ration Dealers : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి 1,629 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవ‌ల జరిగిన‌ సమావేశంలో ఈ మేర‌కు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేస్తారు.

వ‌య‌స్సు : 18 – 44 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

విద్యార్హ‌త : రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి కనీసం 10 వ తరగతి విద్యార్హత.

జీతం : మీరు ఉద్యోగంలో చేరగానే రూ.10,000/- జీతం ల‌భిస్తుంది. ఇతర అలవెన్సులు అంటూ ఏమీ ఉండ‌వు.

ద‌ర‌ఖాస్తు ఫీజు : SC, ST లకు ఏ విధమైనటువంటి ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు. వీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ముఖ్య‌మైన తేదీలు :రేష‌న్ డీల‌ర్ ఉద్యోగానికి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తేదీల‌ను త్వరలోనే ప్ర‌క‌టిస్తారు.

Ration Dealers 1629 రేషన్ డీలర్ల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్‌

Ration Dealers : 1,629 రేషన్ డీలర్ల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్‌..!

ఎంపిక ప్ర‌క్రియ : రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి ఏ విధమైన రాత పరీక్ష ఉండ‌దు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ అభ్యర్థులు మీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకుని వెంటనే రేషన్ డీలర్లుగా నియమించడం జరుగుతుంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ : రేషన్ డీలర్ పోస్ట్లకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు తీసుకోవ‌డం జరుగుతుంది. అయితే జిల్లాల వారిగా వరుసగా నోటిఫికేషన్ అనేవి రావడం జరుగుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది