BRS : వాడిన గులాబీ.. కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన అభ్యర్థులు..!
ప్రధానాంశాలు:
BRS : వాడిన గులాబీ.. కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన అభ్యర్థులు..!
BRS : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్‌లోనే ప్రభావం చూపిస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్థానంలోనే లీడ్ లో ఉంది. ఎంఐఎం ఒక చోట ఆధిక్యంలో ఉంది. మెదక్ లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతుండగా.. హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.
మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

BRS : వాడిన గులాబీ.. కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన అభ్యర్థులు..!
BRS కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిన సైదిరెడ్డి..
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.