TG Govt Fine : 50 రోజుల్లో రూ.8 కోట్ల‌కి పైగా ఫైన్ వేశారా.. చుక్క‌లు చూపిస్తున్న అధికారులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TG Govt Fine : 50 రోజుల్లో రూ.8 కోట్ల‌కి పైగా ఫైన్ వేశారా.. చుక్క‌లు చూపిస్తున్న అధికారులు

TG Govt Fine : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన కీలకమైన హామీల‌ని ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆరు గ్యారెంటీల్లో అతి ప్రధానమైన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా లక్ష రూపాయల లోపు రుణం ఉన్న వారి ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. జూలై 18 నాటికి లక్ష రూపాయల […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  TG Govt Fine : 50 రోజుల్లో రూ.8 కోట్ల‌కి పైగా ఫైన్ వేశారా.. చుక్క‌లు చూపిస్తున్న అధికారులు

TG Govt Fine : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన కీలకమైన హామీల‌ని ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆరు గ్యారెంటీల్లో అతి ప్రధానమైన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా లక్ష రూపాయల లోపు రుణం ఉన్న వారి ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. జూలై 18 నాటికి లక్ష రూపాయల రుణం మాఫీ చేయగా.. రెండో విడతలో భాగంగా నెలాఖరులోపు అనగా.. జూలై చివరి నాటికి.. లక్షన్నర రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపింది.

TG Govt Fine ఉపేక్షించేది లేదు..

మ‌రోవైపు నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడుపుతూ అమాయకులైన ప్రాణాలతో చెల‌గాట‌మాడుతున్న వారిపై కొర‌డా ఝుళిపిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాటిలో ఎక్కువ శాతం స్కూల్ బస్సులే ఉండటం విశేషం. సమ్మర్ సెలవుల తర్వాత.. స్కూల్స్ తెరుచుకోగా.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ 50 రోజుల వ్యవధిలో 900కి పైగా వాహనాలను సీజ్ చేశారు అధికారులు. సరైన డాక్యుమెంట్స్, ఫిట్ నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. మొత్తం 936 వాహనాలకు సంబంధించిన ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు అక్షరాల 8.72 కోట్ల రూపాయల ఫైన్ విధించినట్లు తెలిపారు. వీటితోపాటు కాంపౌండబుల్ రుసుము కింద మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అధిక శాతం హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

TG Govt Fine 50 రోజుల్లో రూ8 కోట్ల‌కి పైగా ఫైన్ వేశారా చుక్క‌లు చూపిస్తున్న అధికారులు

TG Govt Fine : 50 రోజుల్లో రూ.8 కోట్ల‌కి పైగా ఫైన్ వేశారా.. చుక్క‌లు చూపిస్తున్న అధికారులు

ఒక హైదరాబాద్ నుండే సుమారు కోటిన్నర ఫైన్ ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది.ఇలాంటి డ్రైవ్ రానున్న రోజుల్లో కొనసాగిస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. 63 బస్సులకు గానూ.. కోటిన్నర ఫైన్‌ల జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో మరో కోటిన్నర రూపాయల ఆదాయం ఫైన్ల రూపంలో వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది