Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి – రైతన్న ఆవేదన
ప్రధానాంశాలు:
Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి - రైతన్న ఆవేదన
Telangana : ఎండల తీవ్రత పెరగడం.. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత కారణంగా పలు ప్రాంతాల్లో వరి పంట ఎండిపోతుండగా, కొన్ని చోట్ల అది పశువుల మేతగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పంటల వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వ అధికారం ఇచ్చింది. గ్రామాల వారీగా పంటల స్థితిగతులను తెలుసుకోవడానికి అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. సేకరించిన డేటా ఆధారంగా పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు ఎకరానికి రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు పరిహారం ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.

Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి – రైతన్న ఆవేదన
Telangana తెలంగాణ లో వరి పొలాల ఎండిపోతున్న పరిస్థితి
ఈ సంవత్సరం ప్రభుత్వం సన్నలకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగి సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 45 లక్షల ఎకరాల్లో వరి పంటనే వేశారు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. గత యాసంగి కంటే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగుచేయడం వల్ల నీటి వినియోగం పెరిగింది. అధిక వేడి కారణంగా బోరుబావులు పొడిగిపోతుండగా, ఆయకట్టు చివరి ప్రాంతాల్లో వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. గతేడాది అకాల వర్షాలతో రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఎకరానికి రూ. 10,000 పరిహారం ఇచ్చింది. ఇప్పుడు అదే తరహాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రైతులు ఆత్మహత్యల వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
నీటి కొరతకు పరిష్కారం కనుగొనేందుకు ఇటీవల సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి వరికి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తహసీల్దార్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు కలిసి పని చేస్తున్నారు. కరెంట్ సరఫరా గంటలు పెంచడం, భూగర్భ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా రైతులకు మార్గదర్శకాలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు