Tummala and Ponguleti : తుమ్మల, పొంగులేటి స్థానాలు ఫిక్స్.. తేలిన ఖమ్మం లెక్కలు
Tummala and Ponguleti : తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. దానికి కారణం కాంగ్రెస్ లో చేరే నేతలు. తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ నుంచి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ నేతలు కూడా మంచి జోష్ మీదున్నారు. కర్ణాటక ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ త్వరలో తెలంగాణలోనూ గెలిచి తన సత్తా చాటాలని భావిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీనే తమ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే పొంగులేటి కూడా కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊపుమీదుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది.పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అది పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం. ఈ మూడు నియోజకవర్గాల్లో తనకు ఏ నియోజకవర్గం ఇచ్చినా ఓకే అని చెప్పుకొచ్చారు.
Tummala and Ponguleti : పొంగులేటి, తుమ్మలకు సీట్లు ఫిక్స్
అయితే.. తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత చూపిస్తుండటంతో ఆయనకు పాలేరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. పొంగులేటికి ఖమ్మం టికెట్ ఇచ్చి అక్కడి నుంచి గెలిపించుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాను స్వీప్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడం కోసం కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్లకు బీఆర్ఎస్ నేతలు మాత్రం విస్తుపోతున్నారు.